కావలి కాస్తా!

Suniel Shetty, Arjun join Mohanlal's Marakkar movie - Sakshi

సముద్రతీరం నుంచి దేశం లోపలికి వచ్చే శత్రువులను అడ్డుకోవడానికి కావలి కాయనున్నారట మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌. ఇది ఆయన కొత్త సినిమాలో భాగంగానే. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ టైటిల్‌ రోల్‌లో ‘మరాక్కర్‌: అరబికడలింటే సింహమ్‌’ అనే బహు భాషా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.

16వ శతాబ్దంలో కాలికట్‌ ప్రాంతంలో (ఇప్పటి కేరళ) ఉన్న కుంజాలి మరాక్కర్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని మాలీవుడ్‌ టాక్‌. ఇందులో మోహన్‌లాల్‌ తనయుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇప్పుడు ఈ టీమ్‌లోకి ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్, బాలీవుడ్‌ యాక్టర్‌ సునీల్‌ శెట్టి జాయిన్‌ అయ్యారు. కేరళ పిరవి డే సందర్భంగా ఈ సినిమా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో స్టార్ట్‌ అవుతుందని టాక్‌. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top