breaking news
sunil shetti
-
మళ్లీ చిక్కిన ఘరానా దొంగ మహ్మద్ సలీం
సాక్షి, సిటీబ్యూరో/పహాడీషరీఫ్: అసలు పేరు మహ్మద్ సలీం... మారు పేరు సునీల్‌శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు... 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 187 చోరీలు చేశాడు... ఇప్పటి వరకు 25 సార్లు అరెస్టై కటకటాల్లోకి వెళ్ళాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడే సునీల్ గత నెల 5న జైలు నుంచి బయటకు వచ్చాడు... మరో రెండు నేరాలు చేసి బండ్లగూడ పోలీసులకు చిక్కాడు. చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజం ఈ సునీల్ శెట్టి నైజం. ఈ ఘరానా దొంగను బండ్లగూడ పోలీసులు అరెస్టు చేసినట్లు చంద్రాయణగుట్ట ఏసీపీ ఎ.సుధాకర్ గురువారం వెల్లడించారు. మార్చిన ‘ఆమె’ పరిచయం... ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్ లాంతర్ల కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోయి చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్లో కారి్మకుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెళకువలు నేర్చుకున్నాడు. ఇంటి తాళం ముట్టనే ముట్టడు... ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ళనే టార్గెట్‌గా చేసుకుంటాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్‌ఫోన్‌లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్‌పాస్ చేస్తాడు. చిన్న టార్చ్‌లైట్, కటింగ్ ప్లేయర్‌తో ‘రంగం’లోకి దిగే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచి్చనా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు దృష్టిపెట్టరని ఇలా చేస్తుంటాడు. లోపలకు వెళ్లాక చెంచాల సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్‌శెట్టి ఇప్పుడు ఏడుగురి పిల్లలకు తండ్రి. -
వారియర్
మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న బహు భాషా చిత్రం ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, సునీల్ శెట్టి, ప్రభుదేవా, కీర్తీ సురేశ్, ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణీ ప్రియదర్శన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. మోహన్‌లాల్, సునీల్ శెట్టి, ప్రభుదేవాలపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని సునీల్ శెట్టి లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఓ హాలీవుడ్ సినిమాలోని వార్ ఫిల్మ్ ఆధారంగా ఆయన లుక్‌ను డిజైన్ చేశారట. ఈ చిత్రంలో వారియర్‌గా (యోధుడు) సునీల్‌శెట్టి నటిస్తున్నారు. -
రీమేక్‌తో ఎంట్రీ
బాలీవుడు నటుడు సునీల్ శెట్టి 25 సంవత్సరాలుగా హిందీ, దక్షిణాది చిత్రాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తన రెండో జనరేషన్ యాక్టర్స్‌ని స్క్రీన్కు పరిచయం చేస్తున్నారు. ఆల్రెడీ పెద్ద కూతురు అతియా శెట్టిని ‘హీరో’ సినిమా ద్వారా 2015లో సల్మాన్‌ఖాన్ పరిచయం చేశారు. ఇప్పుడు కుమారుడు అహన్ శెట్టిని బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ న డియాడ్వాలా పరిచయం చేయనున్నారు. తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ రైట్స్ ఈ నిర్మాత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ ద్వారా అహన్ శెట్టిని హీరోగా బాలీవుడ్లో పరిచయం చేయనున్నారట. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. -
కావలి కాస్తా!
సముద్రతీరం నుంచి దేశం లోపలికి వచ్చే శత్రువులను అడ్డుకోవడానికి కావలి కాయనున్నారట మలయాళ స్టార్ మోహన్‌లాల్. ఇది ఆయన కొత్త సినిమాలో భాగంగానే. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ టైటిల్ రోల్లో ‘మరాక్కర్: అరబికడలింటే సింహమ్’ అనే బహు భాషా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దంలో కాలికట్ ప్రాంతంలో (ఇప్పటి కేరళ) ఉన్న కుంజాలి మరాక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని మాలీవుడ్ టాక్. ఇందులో మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇప్పుడు ఈ టీమ్‌లోకి ‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి జాయిన్ అయ్యారు. కేరళ పిరవి డే సందర్భంగా ఈ సినిమా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో స్టార్ట్ అవుతుందని టాక్. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారట. -
400 ఏళ్లు వెనక్కి!
సముద్రయానం చేయడం అంత ఈజీ కాదు. ప్రకృతి ప్రభావం వల్ల సముద్రంలో ఎప్పుడు ఆటుపోట్లు వస్తాయో ఊహించడం కష్టం. ఫర్లేదు... అంతా సిద్ధం చేసుకునే రంగంలోకి దిగుతాం అంటున్నారు డైరెక్టర్ ప్రియదర్శన్. ఆయన దర్శకత్వంలో రూపొందనునున్న సినిమా ‘మరక్కార్: ద లయన్ ఆఫ్ అరేబియన్ సీ’. నావెల్ చీఫ్ కుంజాలి మరక్కార్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఇందులో మోహన్‌లాల్, నాగార్జున, పరేష్ రావల్, సునీల్ శెట్టి నటించనున్నారని సమాచారం. ‘‘16వ శతాబ్దం నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాను. మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ ఫిల్మ్. ఎక్కువ శాతం నీటిపై చిత్రీకరించనున్నాం. సినిమాలో బ్రిటిష్ యాక్టర్లు కీలక పాత్రలు చేయనున్నారు. చైనీస్ యాక్టర్స్ కూడా ఉంటారు. ఇండియన్ నేవీకి ఈ సినిమా నా ట్రిబ్యూట్’’ అన్నారు ప్రియదర్శన్. ఈ నెలాఖర్లో నటీనటులందరికీ ఫైనల్ నరేషన్ ఇచ్చిన తర్వాత, జూలైలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందట. అంతేకాదు ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించాలని చిత్రబృందం అనుకుంటున్నారు. -
ఆ ఫోటోకు ఊహించని కామెంట్లు
సినీ హీరోలు మనలాంటి మనుషులే. మనకు ఉండే ఎమోషన్సే వారికి కూడా ఉంటాయి. మన జీవితంలో మనం ప్రాణ స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మనతో ఎక్కువ సేపు గడుపుతూ మన సంతోషాన్ని, బాధల్ని పంచుకుంటూ ఉంటారు స్నేహితులు. మరి మన హీరోలకు స్నేహితులు ఎక్కడి నుంచి వస్తారు. వారి ప్రొఫెషన్లో వారితో ఎక్కువ సేపు గడిపే వారు స్నేహితులుగా మారతారు. కొంతమంది ఆ స్నేహ బంధాన్ని కొనసాగిస్తారు. అలా ఎన్నో సినిమాలు కలిసి చేసిన సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్‌లు ప్రాణ మిత్రులుగా నిలిచారు. వీరి కలయికలో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. అక్షయ్, సునీల్ శెట్టి, పరేశ్ రావల్ కలిసి నటించిన చిత్రం ‘హెర పెరీ’ ఘన విజయాన్ని సాధించింది. అందులో వారి పాత్రల పేర్లు కూడా జనాలకు ఇంకా గుర్తున్నాయి. ప్రస్తుతం అక్షయ్, సునీల్ కలిసి దిగిన ఫోటో ఊహించని కామెంట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు ‘హెర పెరీ’ సినిమాలో కీలక పాత్రపోషించిన పరేశ్ రావల్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఈ సినిమాలో బాబురావు(పరేశ్‌రావల్), అక్షయ్ కుమార్(రాజు), సునీల్ శెట్టి(శ్యామ్) పాత్రల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఈ పాత్రల పేర్లతోనే ప్రేక్షకులు ఇప్పటికి వీరిని తలుచుకుంటున్నారు. అక్షయ్, సునీల్ దిగిన ఫోటోలో బాబు భయ్యా(పరేశ్ రావల్) ఎక్కడ అని సినీ అభిమానులు అడుగుతున్నారు. ఈ పోస్ట్‌కు.. మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారు, హెర పెరీ3 ఎప్పుడు వస్తుంది లాంటి కామెంట్లతో వైరల్‌గా మారింది. సునీల్ చివరగా ‘ఎ జెంటిల్మెన్’ సినిమాలో కన్పించాడు. అక్షయ్ ప్రస్తుతం కేసరి, గోల్డ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘హెర పెరీ’ సినిమాను తెలుగులో ‘ధనలక్ష్మి ఐ లవ్ యూ’గా రీమేక్ చేశారు. This is not a throwback but takes me back to so many. As always was lovely catching up with one of my oldest friend and co-star @SunielVShetty today :) pic.twitter.com/SaRsCCWqKq — Akshay Kumar (@akshaykumar) March 29, 2018 -
నగరంలో సునీల్ శెట్టి..
బంజారాహిల్స్: ‘సేవ్ ద చిల్డ్రన్’ పేరుతో తన అత్తగారు విపులా కద్రి 27 ఏళ్ల క్రితం స్థాపించిన స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని సినీనటుడు సునీల్ శెట్టి అన్నారు. తన భార్య మనా శెట్టితో కలిసి బుధవారం తాజ్‌కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన ‘ఆరాయిష్’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఎగ్జిబిషన్ ద్వారా నిధులు సేకరించి... సంస్థ నిర్వహిస్తున్నామని చెప్పారు. వస్త్రాలు, ఆభరణాలు, పాదరక్షలు తదితర ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మనా శెట్టి మాట్లాడుతూ సామాజిక సేవకు గ్లామర్ రంగాన్ని వినియోగించుకోవడం ఆనందంగా ఉందన్నారు.