ఆ ఫోటోకు ఊహించని కామెంట్లు | Akshay Kumar Posted A Picture In Twitter | Sakshi
Sakshi News home page

ఆ ఫోటోకు ఊహించని కామెంట్లు

Mar 30 2018 6:12 PM | Updated on Mar 30 2018 7:17 PM

Akshay kumar, sunil shetty - Sakshi

సినీ హీరోలు మనలాంటి మనుషులే. మనకు ఉండే ఎమోషన్సే వారికి కూడా ఉంటాయి. మన జీవితంలో మనం ప్రాణ స్నేహితులకు ఎక్కువ  ప్రాధాన్యత ఇస్తాం. మనతో ఎక్కువ సేపు గడుపుతూ మన సంతోషాన్ని, బాధల్ని పంచుకుంటూ ఉంటారు స్నేహితులు.  మరి మన హీరోలకు స్నేహితులు ఎక్కడి నుంచి వస్తారు. వారి ప్రొఫెషన్‌లో వారితో ఎక్కువ సేపు గడిపే వారు స్నేహితులుగా మారతారు. కొంతమంది ఆ స్నేహ బంధాన్ని కొనసాగిస్తారు.

అలా ఎన్నో సినిమాలు కలిసి చేసిన సునీల్‌ శెట్టి, అక్షయ్‌ కుమార్‌లు ప్రాణ మిత్రులుగా నిలిచారు. వీరి కలయికలో ఎన్నో హిట్‌ చిత్రాలు వచ్చాయి. అక్షయ్‌, సునీల్‌ శెట్టి, పరేశ్‌ రావల్‌ కలిసి నటించిన చిత్రం ‘హెర పెరీ’ ఘన విజయాన్ని సాధించింది. అందులో వారి పాత్రల పేర్లు కూడా జనాలకు ఇంకా గుర్తున్నాయి. ప్రస్తుతం అక్షయ్‌, సునీల్‌ కలిసి దిగిన ఫోటో ఊహించని కామెంట్లతో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. నెటిజన్లు ‘హెర పెరీ’ సినిమాలో కీలక పాత్రపోషించిన పరేశ్‌ రావల్‌ ఎక్కడ అని అడుగుతున్నారు.

ఈ సినిమాలో బాబురావు(పరేశ్‌రావల్‌), అక్షయ్‌ కుమార్‌(రాజు), సునీల్‌ శెట్టి(శ్యామ్) పాత్రల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఈ పాత్రల పేర్లతోనే ప్రేక్షకులు ఇప్పటికి వీరిని తలుచుకుంటున్నారు. అక్షయ్‌, సునీల్‌ దిగిన ఫోటోలో బాబు భయ్యా(పరేశ్‌ రావల్‌) ఎక్కడ అని సినీ అభిమానులు అడుగుతున్నారు. ఈ పోస్ట్‌కు.. మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారు, హెర పెరీ3 ఎప్పుడు వస్తుంది లాంటి కామెంట్లతో  వైరల్‌గా మారింది. సునీల్‌ చివరగా ‘ఎ జెంటిల్‌మెన్‌’  సినిమాలో కన్పించాడు. అక్షయ్‌ ప్రస్తుతం కేసరి, గోల్డ్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘హెర పెరీ’ సినిమాను తెలుగులో ‘ధనలక్ష్మి ఐ లవ్‌ యూ’గా రీమేక్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement