మళ్లీ చిక్కిన ఘరానా దొంగ మహ్మద్‌ సలీం | Sunil Shetty Most Wanted Thief of Old City Hyderabad | Sakshi
Sakshi News home page

మళ్లీ చిక్కిన ఘరానా దొంగ మహ్మద్‌ సలీం

Jun 27 2025 9:40 AM | Updated on Jun 27 2025 12:05 PM

Sunil Shetty Most Wanted Thief of Old City Hyderabad

1991 నుంచి నేర ప్రస్థానం... 187 కేసులు 

చోరీ సొమ్ముతో హెలీటూరిజం 

 గురువారం అరెస్టు చేసిన బండ్ల గూడ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో/పహాడీషరీఫ్‌: అసలు పేరు మహ్మద్‌ సలీం... మారు పేరు సునీల్‌శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు... 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 187 చోరీలు చేశాడు... ఇప్పటి వరకు 25 సార్లు అరెస్టై కటకటాల్లోకి వెళ్ళాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడే సునీల్‌ గత నెల 5న జైలు నుంచి బయటకు వచ్చాడు... మరో రెండు నేరాలు చేసి బండ్లగూడ పోలీసులకు చిక్కాడు. చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజం ఈ సునీల్‌ శెట్టి నైజం. ఈ ఘరానా దొంగను బండ్లగూడ పోలీసులు అరెస్టు చేసినట్లు చంద్రాయణగుట్ట ఏసీపీ ఎ.సుధాకర్‌ గురువారం వెల్లడించారు.  

మార్చిన ‘ఆమె’ పరిచయం... 
ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్‌ లాంతర్ల కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోయి చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్‌లో కారి్మకుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్‌ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెళకువలు నేర్చుకున్నాడు.  

ఇంటి తాళం ముట్టనే ముట్టడు... 
ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ళనే టార్గెట్‌గా చేసుకుంటాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్‌ఫోన్‌లో లూడో, క్రికెట్‌ ఆడుతూ టైమ్‌పాస్‌ చేస్తాడు. చిన్న టార్చ్‌లైట్, కటింగ్‌ ప్లేయర్‌తో ‘రంగం’లోకి దిగే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. 

తాళం వేసున్న ఇంటిని టార్గెట్‌ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్‌ వాహనాలు ఆ ప్రాంతానికి వచి్చనా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు దృష్టిపెట్టరని ఇలా చేస్తుంటాడు. లోపలకు వెళ్లాక చెంచాల సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్‌శెట్టి ఇప్పుడు ఏడుగురి పిల్లలకు తండ్రి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement