ఈ గుండుపాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టారా? | Kalyani Priyadarshan And Pranav Mohanlal Childhood | Sakshi
Sakshi News home page

Guess The Actress: తెలుగులో అఖిల్‌తో సినిమా చేసిన హీరోయిన్

Jul 14 2025 3:24 PM | Updated on Jul 14 2025 3:37 PM

Kalyani Priyadarshan And Pranav Mohanlal Childhood

స్టార్ హీరోయిన్లు వరస సినిమాలతో బిజీగా ఉంటారు. అదే టైంలో సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. ఫన్నీ కామెంట్స్‌కి కూడా తమదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇప్పుడు కూడా ఓ స్టార్ హీరోయిన్ తన చిన్నప్పటి ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అది కూడా తన ఫ్రెండ్, యంగ్ హీరోకి బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే విషెస్ కంటే తన గుండు గురించే ఎక్కువగా అడుగుతున్నారని తెగ బాధపడిపోతోంది. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న పాప కల్యాణి ప్రియదర్శన్. అదేనండి తెలుగులో అఖిల్ రెండో సినిమా 'హలో'లో హీరోయిన్‌గా చేసింది. చిత్రలహరి మూవీలోనూ నటించిందిగా. ఆమెనే ఈమె. ఈ రెండు చిత్రాల తర్వాత తెలుగుకి పూర్తిగా దూరమైపోయింది. మాతృభాష మలయాళంలోనే వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాంటిది తన ఫ్రెండ్, మోహన్ లాల్ కొడుకు ప్రణవ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇప్పుడు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో కల్యాణిని చూసి భలే ముద్దుగా ఉందే అని నెటిజన్లు అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?)

కల్యాణి వ్యక్తిగత విషయానికొస్తే.. మలయాళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిసీల సంతానం ఈ బ్యూటీ. ఈమెకు సిద్ధార్థ్ అని సోదరుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం కల్యాణికి 30 ఏళ్లు దాటిపోయాయి. ఇప్పుడు ఎవరి గురించి అయితే పోస్ట్ పెట్టిందో.. అతడితోనే ఈమె రిలేషన్‪‌లో ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. అయితే ప్రణవ్-కల్యాణి స్నేహితులు మాత్రమేనని కొన్నిరోజుల క్రితం స్వయంగా ప్రణవ్ తల్లినే చెప్పుకొచ్చింది.

హీరోయిన్‌గా తెలుగు చిత్రాలతోనే కెరీర్ ప్రారంభించినప్పటికీ.. కల్యాణి ఎందుకో తర్వాత పూర్తిగా మలయాళ, తమిళ చిత్రాలపైనే పూర్తిగా ఫోకస్ చేసింది. మరి అవకాశాలు రాకపోవడమా లేదంటే కావాలనే ఇలా చేసిందా అనేది తెలియదు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement