'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా? | Sreeleela Remuneration For Junior Movie | Sakshi
Sakshi News home page

Sreeleela Remuneration: కొత్త హీరోతో సినిమా.. శ్రీలీల పారితోషికం ఎంత?

Jul 14 2025 1:26 PM | Updated on Jul 14 2025 1:45 PM

Sreeleela Remuneration For Junior Movie

ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ పడలేదు గానీ శ్రీలీల ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయినే. ఈ ఏడాది మార్చిలో 'రాబిన్ హుడ్‍'తో వచ్చింది గానీ కలిసి రాలేదు. ఇప్పుడు కొత్త హీరో కిరీటితో కలిసి 'జూనియర్' అనే మూవీ చేసింది. రీసెంట్‌గా 'వైరల్ వయ్యారి' అనే పాట తెగ వైరల్ అవుతోంది కదా! అది ఈ సినిమాలోనిదే. ఓవైపు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తున్న ఈ బ్యూటీ.. కొత్త కుర్రాడితో చేసేందుకు రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగు మూలాలు ఉన్నప్పటికీ శ్రీలీల.. బెంగళూరులోనే పెరిగింది. హీరోయిన్‪‌గా తొలి మూవీ కూడా కన్నడలోనే చేసింది. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత 'జూనియర్' మూవీతో రాబోతుంది. గాలి జనార్ధన కొడుకు కిరీటి హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న రిలీజ్ చేస్తున్నారు. కాస్తోకూస్తో హైప్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)

అయితే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న శ్రీలీల.. సాధారణంగా రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది. అయితే జూనియర్ కోసం మాత్రం ఈమెకు రూ.4 కోట్ల పారితోషికం ఇచ్చారనే టాక్ నడుస్తోంది. అంటే డబుల్ బొనాంజా. ఈ మూవీలో శ్రీలీల మాత్రం కాస్త చెప్పుకోదగ్గ ఫేస్. కిరీటి కొత్తవాడు. జెనీలియా చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతోనే దక్షిణాదిలోకి రీఎంట్రీ ఇస్తోంది. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?

'జూనియర్' సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా.. రాజమౌళి చిత్రాలకు పనిచేసే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. రాధాకృష్ణ రెడ్డి దర్శకుడు. తెలుగులో 'ఈగ' తదితర సినిమాలు తీసిన వారాహి నిర్మాణ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మించినట్లు విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ క్రమంలోనే శ్రీలీల జాక్ పాట్ కొట్టినట్లు అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement