breaking news
Junior
-
'జూనియర్' టైటిల్ వీడియో సాంగ్.. కిరీటి డ్యాన్స్ అదుర్స్
వ్యాపారవేత్త గాలి జనార్దనరెడ్డి (Janardhana Reddy) కుమారుడు కిరీటి (Kireeti) హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'జూనియర్'.. జులై 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం కిరీటి డ్యాన్స్ అని నెటిజన్లు పేర్కొన్నారు. దీంతో పాటలు ట్రెండ్ అయ్యాయి. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటించగా జెనీలియా, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూనియర్ చిత్రంలో వైరల్ వయ్యారి సాంగ్ తర్వాత టైటిల్ సాంగ్‌లో కిరీటి డ్యాన్స్ బాగుందని ప్రసంశలు పొందాడు. అలాంటి సాంగ్‌ను మీరూ చూసేయండి. -
హీరోగా గాలి జనార్ధన్ తనయుడు.. షూట్లో కారు రియల్ స్టంట్ చూశారా?
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జూనియర్’. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా కనిపించగా.. జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూలై 18న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.ఈ నేపథ్యంలోనే హీరో కిరిటీ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ చిత్రంలోని ఓ సీన్‌కు సంబంధించిన ఒరిజినల్ షూట్ వీడియోను పంచుకున్నారు. కారుపై నుంచి కిరిటీ జంప్ చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించాడో ఈ వీడియోలో చూపించారు. ఈ షూటింగ్ స్టంట్ కోసం కష్టపడిన పీటర్ హెయిన్ మాస్టర్‌తో పాటు సిబ్బందికి హీరో ధన్యవాదాలు తెలిపారు. ఫైనల్‌గా రిజల్ట్ ఇలా వచ్చిందంటూ వీడియోలో మూవీ సీన్ చూపించారు. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.Behind the making of my stunt in #Junior Thanks to Peter Hein Master and all the stunt crew for ensuring my safety. pic.twitter.com/ua7eDQ08Eh— Kireeti (@KireetiOfficial) July 22, 2025 -
'వైరల్ వయ్యారి' కొరియోగ్రాఫర్ మన మణుగూరు బిడ్డనే..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సోషల్‌మీడియాలో 'వైరల్ వయ్యారి' అంటూ 'జూనియర్' సినిమా సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే సౌండ్ వినిపిస్తుంది. అయితే, ఈ పాటకు హీరో కిరీటి, శ్రీలీల పోటీపడి డ్యాన్స్ చేశారు. పాట మొత్తం ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు వేశారు. అయితే, ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన కుర్రోడు ఎవరు..? అని సోషల్‌మీడియాలో వెతుకుతున్నారు. ఈ పాటకు స్టెప్పులు వేయించింది తెలంగాణ బిడ్డే.. మణుగూరుకు చెందిన రేవంత్ మాస్టర్ ఈ సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన రేవంత్ పూలమార్కెట్ ప్రాంతంలో ఉంటాడు. తన అమ్మగారు సుభద్ర పూలదుకాణం నడుపుతున్నారు. భర్తను కోల్పోయిన ఆమె పట్టుదలతో ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెను ఉన్నంతలో చదివించారు. వారిలో చిన్నవాడైన రేవంత్‌కు డ్యాన్స్ అంటే పిచ్చి. దీంతో పదో తరగతి పూర్తి అయిన తర్వాత 2013లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ చిన్నచిన్న ఈవెంట్లు చేశాడు. తండ్రి మరణం తర్వాత ఇబ్బందులు వచ్చినా తన అమ్మగారు పూలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించింది. రేవంత్ కూడా హైదరాబాద్‌లో పనిచేస్తూ.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరి డ్యాన్స్‌లో శిక్షణ పొందాడు. అక్కడి నుంచి అతని ప్రయాణం మరో అడుగు ముందుకు పడింది.సైడ్ డ్యాన్సర్‌గా పనిచేసిన రేవంత్.. ఢీ 9వ సీజన్లో కంటెస్టెంట్‌గా మెప్పించాడు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా ఢీ 15వ సీజన్లో రెండో ఫైనలిస్ట్‌గా నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో శేఖర్ మాస్టర్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన పర్యవేక్షణలో ఆచార్య సినిమాలోని 'భలే బంజారా' పాటకు పనిచేశాడు. అలా సుమారు వందకు పైగా పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా రేవంత్ పనిచేయడం విశేషం. తన టాలెంట్‌ను గుర్తించిన జూనియర్ సినిమా మేకర్స్ ఏకంగా రెండు పాటలకు ఛాన్స్ ఇచ్చారు. వైరల్ వయ్యారి సాంగ్‌తో పాటు టైటిల్ సాంగ్‌కు కూడా రేవంత్ కోరియోగ్రఫీ ఇచ్చాడు. తన విజయానికి తన అమ్మగారు ఎంత కష్టపడ్డారని ఆయన తెలిపాడు. ఆపై శేఖర్ మాస్టర్ నేర్పించిన మెలకువలు తన జీవితాన్ని మార్చేశాయని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Revanth_rey7 (@revanthgollamandala) -
'జెనీలియా' కోసం స్పెషల్ సాంగ్ పాడిన దేవి శ్రీ ప్రసాద్
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘జూనియర్’. ఈ నెల 18న విడుదల అవుతున్నా ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అగ్ర నటీనటులతో దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీ కొర్రపాటి నిర్మాత. శ్రీలీల కథానాయికగా నటించింది. జెనీలియా, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే, జెనీలియా కోసం సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ప్రత్యేకమైన పాటతో మెప్పించారు.ఒకప్పుడు తెలుగు తెరపై యూత్ కలలరాణిగా జెనీలియా గుర్తింపు పొందారు. సుమారు 13 ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్‌పై ఆమె మళ్లీ 'జూనియర్' సినిమాతో కనిపించనుంది. దీంతో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ 'బొమ్మరిల్లు' సినిమా నుంచి 'అప్పుడో ఇప్పుడో కలగన్నానే చెలి' సాంగ్‌తో ఆమెను మెప్పించారు. ఈ సాంగ్‌తో పాటు బొమ్మరిల్లు సినిమా కూడా జెనీలియా కెరీర్లో చాలా ప్రత్యేకం. అందుకే ఆమె కూడా దేవీ పాటకు బాగా కనెక్ట్ అయ్యారు. సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.‘బొమ్మరిల్లు’లో జెనీలియా పోషించిన హాసిని పాత్ర అందరికి గుర్తుండిపోయింది. వివాహానంతరం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఆమె దాదాపు 13ఏళ్ల విరామం తర్వాత దక్షిణాదిలో 'జూనియర్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో జెనీలియా కీలక చాలా కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా కథ తనతో పాటు భర్త రితేష్దేశ్ముఖ్కు కూడా బాగా నచ్చడంతోనే నటించానని ఆమె చెప్పారు. బొమ్మరిల్లులో హాసిని, హ్యాపీలో మధుమతి పాత్రలు ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మెమొరబుల్‌గా మిగిలిపోయాయని చెప్పవచ్చు. అందుకే జెనీలీయా చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. -
'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?
ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ పడలేదు గానీ శ్రీలీల ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయినే. ఈ ఏడాది మార్చిలో 'రాబిన్ హుడ్'తో వచ్చింది గానీ కలిసి రాలేదు. ఇప్పుడు కొత్త హీరో కిరీటితో కలిసి 'జూనియర్' అనే మూవీ చేసింది. రీసెంట్గా 'వైరల్ వయ్యారి' అనే పాట తెగ వైరల్ అవుతోంది కదా! అది ఈ సినిమాలోనిదే. ఓవైపు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తున్న ఈ బ్యూటీ.. కొత్త కుర్రాడితో చేసేందుకు రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.తెలుగు మూలాలు ఉన్నప్పటికీ శ్రీలీల.. బెంగళూరులోనే పెరిగింది. హీరోయిన్గా తొలి మూవీ కూడా కన్నడలోనే చేసింది. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత 'జూనియర్' మూవీతో రాబోతుంది. గాలి జనార్ధన కొడుకు కిరీటి హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న రిలీజ్ చేస్తున్నారు. కాస్తోకూస్తో హైప్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)అయితే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న శ్రీలీల.. సాధారణంగా రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది. అయితే జూనియర్ కోసం మాత్రం ఈమెకు రూ.4 కోట్ల పారితోషికం ఇచ్చారనే టాక్ నడుస్తోంది. అంటే డబుల్ బొనాంజా. ఈ మూవీలో శ్రీలీల మాత్రం కాస్త చెప్పుకోదగ్గ ఫేస్. కిరీటి కొత్తవాడు. జెనీలియా చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతోనే దక్షిణాదిలోకి రీఎంట్రీ ఇస్తోంది. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?'జూనియర్' సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా.. రాజమౌళి చిత్రాలకు పనిచేసే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. రాధాకృష్ణ రెడ్డి దర్శకుడు. తెలుగులో 'ఈగ' తదితర సినిమాలు తీసిన వారాహి నిర్మాణ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మించినట్లు విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ క్రమంలోనే శ్రీలీల జాక్ పాట్ కొట్టినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు వైరల్) -
వైరల్ వయ్యారి పాటకు స్టేజీపై స్టెప్పులేసిన శివన్న
ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి నేనే.. పాటే వినిపిస్తోంది. ఇందులో శ్రీలీల, కిరీటి జంటగా డ్యాన్స్ చేశారు. శ్రీలీల గ్రేస్, డ్యాన్స్ గురించి తెలియంది కాదు! ఎప్పటిలాగే అల్లాడించేసింది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కిరీటి గురించే! జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన ఈ యంగ్ హారో.. ఆయనలాగే పపర్ఫుల్గా స్టెప్పులేశాడు. నిన్ను చూస్తుంటే తారక్‌ను చూస్తున్నట్లే ఉందని చాలామంది కిరీటపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇతడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు. జూనియర్ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు.వయ్యారి సాంగ్‌కు స్టేజీపై స్టెప్పులుఈ మూవీ జూలై 18న విడుదల కానుంది. ఈ క్రమంలో బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో కిరీటి శివన్నతో స్టేజీపై స్టెప్పులేయించాడు. వైరల్ వయ్యారి పాటకు స్టెప్పు ఇది.. అని ఒకసారి చూపించగనే శివన్న ఇట్టే నేర్చేసుకున్నారు. పాట ప్లే అవుతుంటే ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.జూనియర్ సినిమా విశేషాలుప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటించిన చిత్రం జూనియర్. జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు పని చేసిన కేకే సెంథిల్ కుమార్ జూనియర్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. A true viral moment 💥💥Karunada Chakravarthy @NimmaShivanna Garu dances to the #ViralVayyari song with the lead pair at the Junior Grand Pre Release Event ❤🔥#Junior grand release on July 18th ✨A Rockstar @ThisIsDSP Musical 🎸🔥 pic.twitter.com/lpAxfYmnSa— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 13, 2025 చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అంతలోనే సిట్టింగా? -
టెక్నాలజీతో ఫైట్ చేయలేం: సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్‌కుమార్
‘‘సినిమా గ్రాండియర్‌గా ఉంటే ఆడియన్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా కంటే ముందు ‘మగధీర’ సినిమాను చెప్పుకునేవారు. అయితే సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉన్నా, కొత్త ప్రపంచాలను సృష్టించినా, హ్యూమన్ ఎమోషన్స్ అనేవి కథలో చాలా ముఖ్యం. ‘బాహుబలి’ తర్వాత ఈ తరహాలో ఇతర ఇండస్ట్రీస్లోనూ సినిమాలొచ్చాయి. కానీ ప్రేక్షకుల ఎమోషన్స్‌కు కనెక్ట్ అయిన సినిమాలే విజయాలు సాధించాయి. ‘జూనియర్’ సినిమా కథలో ప్రేక్షకులను కదిలించే భావోద్వేగాలు నచ్చి, ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అని సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్‌కుమార్ అన్నారు.ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్‌కుమార్ చెప్పిన విశేషాలు. ⇒ ఎవరైనా కొత్తవారిని పరిచయం చేస్తున్నప్పుడు సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ ఉంటే చాలనుకుంటారు. కానీ ఫ్యామిలీ డ్రామా జానర్‌కి వెళ్లరు. అయితే కొత్త హీరోగా కిరీటి ఈ చాలెంజ్ తీసుకోవడం నాకు నచ్చింది. కిరిటీ హార్డ్‌వర్కర్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్... ఇలా అన్నీ బాగా చేశాడు. నిర్మాత సాయిగారితో ‘ఈగ’ సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమా చేయడ హ్యాపీ. రాధాకృష్ణ క్లారిటీ ఉన్న దర్శకుడు. ⇒ రాజమౌళిగారి ‘ఛత్రపతి, యమదొంగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలకు నేను సినిమాటోగ్రాఫర్‌గా చేశాను. ఆ మధ్యలో ‘విక్రమార్కుడు, మర్యాద రామన్న’ వంటి సినిమాలకు నేను చేయలేదు. అలాగే ప్రస్తుతం రాజమౌళిగారి సినిమాకు (మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న సినిమా) నేను సినిమాటోగ్రాఫర్‌గా చేయకపోవడం పట్ల షాకవ్వాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మళ్లీ కలిసి పని చేస్తాం. ⇒ రెండు దశాబ్దాల నా కెరీర్ సంతృప్తిగా ఉంది. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ సినిమాలకు పని చేయడం నా అదృష్టం. కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ అప్డేట్ అవుతుంటా. టెక్నాలజీతో ఫైట్ చేయలేం. సినిమాటోగ్రఫీ పైనే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీపైన ఏఐ (కృత్రిమ మేధ) ప్రభావం ఉంటుంది. మంచి ఉంది... చెడు ఉంది. ⇒ ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభూ’ సినిమా చేస్తున్నాను. ‘బాహుబలి’ తరహాలో ఇది కూడా రాజుల కథ. అలాగే నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ సినిమా చేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగిన కథ ఇది. వీర్ సవార్కార్ నేపథ్యంలో కథ ఉంటుంది. ఐదారు లక్షల లీటర్ల వాటర్ ఉన్న ఓ ట్యాంకులో సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరిపే ప్లాన్ చేశాం. కానీ సెట్స్‌లో వాటర్ ట్యాంకు పేలి, ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు. ⇒ హాలీవుడ్లో ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరణ జరుగుతోంది. క్రిస్టోఫర్ నోలన్ వంటివారు అలా చేస్తున్నారు. ఓ సినిమాను ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించాలా? లేదా? అనేది ఆ సినిమా దర్శక–నిర్మాతల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐమ్యాక్స్ కెమెరాతో చిత్రీకరించినప్పుడు హాలీవుడ్లో మంచి థియేటర్స్ దొరుకుతాయి. ఇక భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. -
ఒకే ఒక పెద్ద సినిమా.. టాలీవుడ్‌కి ఏమైంది?
టాలీవుడ్లో మొన్నటి వరకు పోటీ లేకుండా సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఒకేవారం పెద్ద సినిమాతో పాటు మూడు, నాలుగు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అయ్యేవి. కానీ సమ్మర్ నుంచి టాలీవుడ్లో పెద్దగా పోటీ లేకుండా సినిమాలు వస్తున్నాయి. ఇక గత నెలలో థగ్‌లైఫ్, కుబేర, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలు వచ్చినా.. వాటి మధ్యలో కూడా వారం, వారం గ్యాప్ ఉంది. వీటితో పాటు రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కానీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక జులైలో టాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెల మొత్తంలో ఒకే ఒక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. మిగిలిన సినిమాలన్ని పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగబోతున్నాయి.జులై మొదటి వారంలో తమ్ముడు చిత్రంలో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ హీరోయిన్లుగా నటించగా, లయ కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మేరకు అయినా సినిమా ఆడుతుందో లేదో జులై 4న తెలుస్తుంది. ఇక అదే రోజు సిద్ధార్థ్ నటించిన 3 బి.హెచ్.కె కూడా విడుదల కానుంది. తమ్ముడుతో పోలిస్తే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్‌కి వెళ్లి చూసే పరిస్థితి అయితే ఈ సినిమాకు లేదు.ఇక రెండో వారంలో అనుష్క షూటీ రిలీజ్ కావాల్సింది. కానీ అది వాయిదా పడింది. దీంతో ఈ వారంలో ఎలాంటి పోటీ లేకుండా సింగిల్‌గా బరిలోకి దిగుతున్నాడు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ జులై 11న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. మరి సింగిల్‌గా వస్తున్న సుహాస్.. సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.ఇక మూడో వారంలో మేఘాలు చెప్పిన ప్రేమ కథ(జులై 17) అనే చిన్న సినిమాతో పాటు జూనియర్(జులై 18 అనే కన్నడ-తెలుగు సినిమా కూడా ఇక్కడ విడుదల కాబోతుంది. గాలి జనార్థన్‌రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా నటిస్తున్న జూనియర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం, హీరోయిన్గా శ్రీలీల నటించడం, మరో కీలక పాత్రలో జెనీలియా కనిపించడంతో జూనియర్‌పై టాలీవుడ్లో మంచి హైప్ క్రియేట్ అయింది.ఇక చివరి వారంలో (జూలై 24) హరిహరి వీరమల్లు రాబోతుంది. ఈ నెలలో వస్తున్న ఏకైక పెద్ద సినిమా ఇదే. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎంఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాలో నిధి అగర్వాల హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిది. -
హీరోగా గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు.. టీజర్ చూశారా?
గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బ్యానర్లో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.మూవీ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే కాలేజీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా జులై 18న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో రవి చంద్రన్, జెనీలియా, రావు రమేష్, సుధారాణి, అచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. -
గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ‘జూనియర్’.. సాంగ్ రిలీజ్
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించగా, జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘లెట్స్ లివ్ దిస్ మూమెంట్... లెట్స్ లవ్ దిస్ మూమెంట్..’ అనే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను బెంగళూరులో నిర్వహించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలో శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను జస్ప్రీత్ జాజ్ పాడారు. విజయ్ పొలాకి నృత్య రీతులు సమకూర్చారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో కిరిటీ రెడ్డి మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా తీశాం. ‘జూనియర్’లోని ప్రతి మూమెంట్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో నాకు గాయమైంది. దాంతో కోలుకోడానికి ఏడాది పట్టింది. ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. లెజెండరీ యాక్టర్ వి. రవిచంద్రన్‌గారు మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఈ సినిమాలో నటించారు’’ అని తెలిపారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం కిరీటి చాలా హార్డ్ వర్క్ చేశాడు’’ అని తెలిపారు వి. రవిచంద్రన్. ‘‘రవిచంద్రన్, సెంథిల్, దేవిశ్రీప్రసాద్గార్లు వంటి సీనియర్స్ ఉండటం వల్ల మా ‘జూనియర్’ సినిమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పారు రాధాకృష్ణ. ‘‘కిరీటి యాక్షన్, డ్యాన్సింగ్ స్కిల్స్ చాలా సర్ప్రైజ్ చేశాయి. నటుడిగా అతనికి గొప్ప భవిష్యత్ ఉంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ వేడుకలో కొరియోగ్రఫర్ విజయ్ ΄ోలాకి, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ మాట్లాడారు. -
సెయిలింగ్‌లో తెలంగాణ సత్తా : స్పెషల్ ఎట్రాక్షన్‌గా అమ్మాయిల నైపుణ్యం
సాక్షి, సిటీబ్యూరో: గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెయిలింగ్‌లో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా రాణిస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ జూనియర్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్స్ నాలుగు బంగారు పతకాలు సహా మొత్తం ఆరు పతకాలతో సత్తా చాటారు. ముంబైలోని మార్వేలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ రసూల్‌పురాలోని ఉద్భవ్ స్కూల్‌కు చెందిన లాహిరి కొమరవెల్లి అండర్–16 సబ్ జూనియర్ విభాగంలో బంగారు పతకం గెలిచింది. మొత్తం 9 రేసుల రెగెట్టాలో 4 రేసుల్లో మొదటి స్థానం, రెండు రేసుల్లో రెండో స్థానంతో 13 పాయింట్లతో 2025 జాతీయ చాంపియన్‌గా నిలిచింది. అదే స్కూల్‌కు చెందిన తనూజ కామేశ్వర్– శ్రవణ్ కత్రావత్లు జూనియర్ డబుల్ హ్యాండర్ విభాగంలో చివరి రోజు రెండు రేసులను గెలిచి నేషనల్ చాంపియన్స్ అయ్యారు. ఇదీ చదవండి: తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీఅండర్–15 బాలుర విభాగంలో బన్నీ బొంగూర్ బంగారు పతకం నెగ్గగా, రిజ్వాన్ మహమ్మద్ రజతం, రవి కుమార్ కాంస్యం గెలిచారు. ఒక ఈవెంట్లో తెలంగాణకు చెందిన ముగ్గురు సెయిలర్లు పోడియంపైకి రావడం ఇదే తొలిసారి. ఉద్భవ్ స్కూల్‌కు చెందిన చంద్రలేఖ తట్టారి తొలిసారి కాంస్య పతకం సాధించాడు. మొత్తంగా అండర్–16 సబ్ జూనియర్స్ పోడియంపైకి వచ్చిన ఆరుగురు సెయిలర్లలో ఐదుగురు తెలంగాణ క్రీడాకారులే కావడం విశేషం. ఈ సందర్భంగా హైదరాబాద్ యాచ్ క్లబ్ అధ్యక్షుడు, కోచ్ సుహీమ్ షేక్ సంతోషం వ్యక్తం చేశాడు.ఇదీ చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియోగతేడాది నుంచి తాము చేసిన ఫిట్నెస్, న్యూట్రిషన్, సైద్ధాంతిక శిక్షణ ఫలితాలను ఇచ్చిందని అన్నారు. నేషనల్స్‌లో టాప్–14లో ఎనిమిది మంది తెలంగాణ రాష్ట్రం వాళ్లే ఉండటం తమ శిక్షణ ఫలితమని, ఇది ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపాడు. జూన్‌లో జరిగే లాంగ్‌కవి ఇంటర్నేషనల్ టోర్నీ కోసం ఎంపికైన సెయిలర్స్ జాబితా త్వరలో విడుదల కానుంది. తెలంగాణ నుంచి కనీసం ఏడుగురు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ సెయిలర్స్ షిల్లాంగ్‌లో జరిగే జాతీయ ర్యాంకింగ్ రెగెట్టాలో పాల్గొని, ఆ తర్వాత హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో జరిగే మాన్సూన్ రెగెట్టా ట్రోఫీలోనూ బరిలో నిలవనున్నారు. చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో -
ప్రణామ్ ప్రణవ్
ఆరేళ్ల వయసులో ఎత్తులు వేయడం నేర్చుకున్న ఆ చిన్నారి... పదహారేళ్లు వచ్చేసరికి గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. మ్యాచ్‌కు ముందు పావులతో ప్రాక్టీస్ చేయడం పక్కనపెట్టి క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలా వేర్వేరు ఆటల్లో నిమగ్నమయ్యే అలవాటున్న ఆ కుర్రాడు... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. విశ్వ చదరంగ వేదికపై భారత జోరు సాగుతున్న క్రమంలో... ఆ కుర్రాడు ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ఇటీవల మోంటెనిగ్రోలో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన ఆ కుర్రాడే... ప్రణవ్ వెంకటేశ్! రెండేళ్ల క్రితమే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ఈ తమిళనాడు యువ సంచలనం... భవిష్యత్తులో నిలకడగా విజయాలు సాధించడమే తన లక్ష్యమని అంటున్నాడు. చదరంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చెన్నైకి చెందిన ఈ కుర్రాడి ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం జూనియర్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది క్రితం... ప్రణవ్ ప్రయాణం క్రికెట్ మైదానంలో మొదలైంది. అదేంటి అప్పటికే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ప్రణవ్ క్రికెట్ గ్రౌండ్ నుంచి ప్రాక్టీస్ ప్రారంభించడం ఏంటి అని సందేహిస్తున్నారా? ప్లేయర్లు ఆటవిడుపు కోసం అప్పుడప్పుడు వేరే క్రీడలు ఆడటం పరిపాటే! అలాగే చెన్నైలోని పెరంబూరు సమీపంలోని చెస్ అకాడమీలో సీనియర్ గ్రాండ్‌మాస్టర్ శ్యామ్‌సుందర్ నిర్వహిస్తున్న కోచింగ్‌కు వరుణ్ హాజరయ్యాడు. ఆటగాళ్లను శారీరకంగా చురుకుగా ఉంచడంతో పాటు వారిలో ఉత్సాహం నింపేందుకు నిర్వహిస్తున్న క్యాంప్‌లో ప్రణవ్ క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. అప్పటి వరకు శ్యామ్‌సుందర్ వద్ద శిక్షణ తీసుకోని వరుణ్... ఆ తర్వాత అతడితో అనుబంధం పెంచుకున్నాడు. గతంలో ఇతర కోచ్‌ల వద్ద ట్రైనింగ్ తీసుకున్న అతడు... శ్యామ్‌లో ఓ సోదరుడిని చూసుకున్నాడు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న శ్యామ్‌తో ప్రయాణం తనకు లాభసాటి అని భావించి తండ్రి వెంకటేశ్ అనుమతితో అతడి దగ్గర శిష్యరికం ప్రారంభించాడు. క్లాసికల్ కష్టమైనా... బ్లిట్జ్ గేమ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన ప్రణవ్ ఇప్పటికే ఆన్లైన్ మ్యాచ్‌ల్లో మాగ్నస్ కార్ల్సన్ వంటి ప్రపంచ చాంపియన్లపై విజయాలు సాధించాడు. ప్రారంభంలో బ్లిట్జ్ నుంచి క్లాసికల్‌కు మారేందుకు కాస్త సమయం తీసుకున్న ప్రణవ్... ఆ తర్వాత ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడం ప్రారంభించాడు. శ్యామ్ వద్ద శిక్షణ ప్రారంభించిన రెండు నెలలకే స్పెయిన్ వేదికగా జరిగిన టోర్నీల్లో పాల్గొనేందుకు వరుణ్ విరామం తీసుకున్నాడు. ఆ సమయంలో సరైన ఫలితాలు రాకపోవడంతో... మరింత సమయం తీసుకున్న శ్యామ్... వరుణ్ ఆటతీరుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించడం ప్రాంరభించాడు. ఆ దిశగా కసరత్తు చేయడంతో... దుబాయ్ చాంపియన్‌షిప్, షార్జా మాస్టర్స్‌లో అతడు విజేతగా నిలిచాడు. గతేడాది డిసెంబర్లో చెన్నై చాలెంజర్స్ ఇన్విటేషనల్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ప్రణవ్ ప్రతిష్టాత్మక చెన్నై మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. బాటిల్ మూతలతో క్రికెట్... మ్యాచ్‌కు ముందు ఆటవిడుపుగా క్రికెట్, టేబుల్ టెన్నిస్, షటిల్ ఆడటం ప్రణవ్‌కు అలవాటు. దీంతో హోటల్ రూమ్‌లో బాటిల్ మూతలను బాల్‌గా భావించి మంచి నీళ్ల సీసాలతోనే కోచ్ శ్యామ్‌తో కలిసి క్రికెట్ ఆడేవాడు. దీంతోనే ఇతర ఆలోచనలు దరిచేరనివ్వకుండా మనసును లగ్నం చేసుకునే వాడు. సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండేవాడు. ప్రపంచ జానియర్ చెస్ చాంపియన్‌సిప్ ప్రారంభానికి ముందు కొన్ని ఆన్లైన్ సెషన్లలో పాల్గొన్న ప్రణవ్... ప్రత్యర్థిపై కాస్త ఆధిక్యం దక్కినా... దాన్ని కొనసాగిస్తూ మరిన్ని అవకాశాలు సృష్టించుకోవడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. శిక్షణ సమయంలో విభిన్న ప్రత్యామ్నాయాలను ప్రయత్నించే ప్రణవ్... ఒక్కసారి మ్యాచ్ ప్రారంభమైతే... ప్రత్యర్థి ఆటతీరును బట్టి ప్రణాళికలు మార్చుకోవడంలో ఆరితేరాడు. దాని ఫలితమే... విశ్వనాథన్ ఆనంద్ (1987), పెంటేల హరికృష్ణ (2004), అభిజిత్ గుప్తా (2008) తర్వాత... ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌గా నిలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా ప్రణవ్ గుర్తింపు పొందాడు. అజేయంగా... తాజా ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో మొత్తం 11 రౌండ్ల పాటు పోటీలు జరగగా... ప్రణవ్ 9 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 7 గేమ్‌లు గెలిచిన ప్రణవ్... మిగిలిన 4 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా వరల్డ్ చాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ‘ఆటలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా... ఏమాత్రం వెనక్కి తగ్గని ప్రణవ్... ఏ క్షణంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోడు. ఇద్దరం తమిళనాడుకు చెందిన వాళ్లమే కావడంతో... తమిళంలోనే మాట్లాడుకుంటాం. దీంతో ఒకరి భావాలు మరొకరం సులభంగా అర్థం చేసుకుంటాం. కామెడీ సినిమాలను ఎక్కువ ఇష్టపడే ప్రణవ్... ఆట తప్ప వేరే ఆలోచనలను దరిచేరనివ్వడు. ఆ క్రమశిక్షణే అతడిని ఈ స్థాయికి తెచ్చింది. చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తరహాలో నిలకడ కొనసాగించడమే ప్రణవ్ లక్ష్యం’ అని 32 ఏళ్ల శ్యామ్ వివరించాడు. క్రికెట్‌కు వీరాభిమాని... క్రికెట్‌ను విపరీతంగా అభిమానించే ప్రణవ్ కు... నేటి తరం ప్రేక్షకుల్లాగే టెస్టుల కన్నా... వన్డే, టి20 ఫార్మాట్లంటేనే ఎక్కువ ఇష్టం. చదరంగంలో క్లాసికల్ గేమ్ టెస్టుల మాదిరి కాగా... వన్డే, టి20ల వంటి ర్యాపిడ్, బ్లిట్జ్‌లో ప్రణవ్ వేగం శ్యామ్‌సుందర్‌ను ఆకట్టుకుంది. కాస్త సానబెడితే అద్భుతాలు సాధించగల సత్తా అతడిలో ఉందని గుర్తించిన శ్యామ్ ఆ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఏడాది శిక్షణలో అతడికిష్టమైన ర్యాపిడ్ బ్లిట్జ్‌లో మరింత మెరుగు పరుస్తూనే... సంపద్రాయ క్లాసికల్పై కూడా ఆసక్తి పెరిగేలా చేశాడు. ‘గత సంవత్సరం జనవరి నుంచి అధికారికంగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. అప్పటికే గ్రాండ్‌మాస్టర్ అయిన ప్రణవ్ను మరింత మెరుగు పర్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాను. టి20 క్రికెట్లో దూకుడుగా ఆడేందుకు వీలుంటుంది. అదే టెస్టు క్రికెట్లో ఓపిక ముఖ్యం. ప్రణవ్ కూడా క్విక్ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ వంటి క్లాసికల్లో మరింత ప్రావీణ్యం పొందే విధంగా తర్ఫీదునిచ్చాను’ అని శ్యామ్ సుందర్ విరించాడు. -
విజేత అర్జున్... రన్నరప్ సరయు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆదిరెడ్డి అర్జున్, వేల్పుల సరయు అదరగొట్టారు. హరియాణాలోని కర్నాల్ పట్టణంలో జరిగిన ఈ టోరీ్నలో ఓపెన్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఆదిరెడ్డి అర్జున్ టైటిల్‌ను నిలబెట్టుకోగా... వరంగల్ జిల్లాకు చెందిన సరయు రన్నరప్‌గా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 14 ఏళ్ల అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అర్జున్ 8 గేముల్లో గెలిచి, 3 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు. సౌరత్ బిశ్వాస్ (పశ్చిమ బెంగాల్; 8.5 పాయింట్లు) రెండో స్థానంలో, జైవీర్ మహేంద్రు (మహారాష్ట్ర; 8.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో సరయు నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9 పాయింట్లతో మృతిక మల్లిక్ (పశ్చిమ బెంగాల్)తో కలిసి సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. అయితే చాంపియన్‌ను నిర్ణయించేందుకు మైరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. మెరుగైన టైబ్రేక్ స్కోరుతో మృతిక టైటిల్ సొంతం చేసుకోగా... సరయుకు రెండో స్థానంతో రన్నరప్ ట్రోఫీ దక్కింది. సరయు తొమ్మిది గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయింది. విజేత అర్జున్, రన్నరప్ సరయులను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు. -
70 శాతం మార్కులు వస్తేనే.! జేపీఎస్ రెగ్యులరైజేషన్‌లో సర్కార్ మెలిక
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమై, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపులో 70 శాతం మార్కులు వచ్చిన వారినే క్రమబద్దికరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ అధికారిక మెమోను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని జేపీఎస్‌ల పనితీరును సమీక్షించి మార్కులు ఇస్తున్నాయని, కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో 70శాతం, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని క్రమబద్దికరిస్తూ నియామక ఉత్తర్వులు అందజేయాలని ఈ మెమో లో స్పష్టం చేశారు. ఒకవేళ 70శాతం మార్కులు రాకపోతే ఆయా జేపీఎస్‌లకు మరో ఆరునెలల గడువు ఇవ్వాలని, అప్పుడు మరోమారు పనితీరు మదింపు చేసి అప్పటి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలి జిల్లా స్థాయిలో ఆయా కమిటీల మదింపు నివేదికలను గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని, పనితీరు సంతృప్తిగా ఉన్న జేపీఎస్‌లకు ఇచ్చే నియామక ఉత్తర్వులను కూడా ఇదే యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు అప్పగించారు. అర్హత పొందిన జేపీఎస్‌లకు ఇవ్వాల్సిన నియామక ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదాను కూడా ఈ మెమోతో జతచేసి జిల్లాలకు పంపారు. ప్రభుత్వ నిర్ణయం విడ్డూరం: టీపీఎస్ఏ పనితీరు మదింపులో 70శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే క్రమబద్దికరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విడ్డూరంగా ఉన్నా యని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) వ్యాఖ్యానించింది. డైరెక్ట్‌గా రిక్రూట్ అయి మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, ఇ. శ్రీనివాస్‌లు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామీ ణాభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో అనేక గందరగోళాలకు తావిస్తోందని, తమ డిమాండ్ ప్రకారం అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయకుంటే పోరాటా నికి దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
అగ్రిమెంట్ లోని అంశాలను గుర్తు చేస్తోన్న జేపీఎస్ లు
-
హాస్టల్లో ర్యాగింగ్ భూతం.. జూనియర్‌ను కర్రతో చితకబాదిన టెన్త్ క్లాస్ విద్యార్థి
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూనియర్ విద్యార్థిని ఓ 10వ తరగతి విద్యార్థి చితకబాదాడు. సోమవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల హాస్టల్లో బాధిత బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఓ పదో తరగతి విద్యార్థి తాను చెప్పిందే వినాలని కొంతకాలంగా జూనియర్లను భయపెడుతూ మాటవిననివారిని కొడుతున్నాడు. హోలీ పండగ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న తనతోపాటు మరికొందరు విద్యార్థులను లేపి డాన్స్ చేయమని బెదిరించాడని, చేయకుంటే కొట్టాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే నాలుగింతలు దెబ్బలు తింటారని బెదిరించడంతో ఎవరికీ చెప్పుకోలేదని బాధిత విద్యార్థి వాపోయాడు. శనివారం రాత్రి మరోమారు గదికి వచ్చి కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడని, దెబ్బలు తాళలేక ఆదివారం ఉదయం జడ్చర్లలోని తన మేనత్త శాంతమ్మ వద్దకు వెళ్లినట్లు చెప్పాడు. అతడి మేనత్త వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం ఉదయం హాస్టల్ వద్ద బాధిత విద్యార్థి, బంధువులు ఆందోళనకు దిగారు. ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి హాస్టల్‌కు వచ్చి విచారణ చేపట్టారు. ఆవేశంలో తప్పు చేశానని, ఇకపై చేయబోనని పదో తరగతి విద్యార్థి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. త్వరలో పరీక్షలు ఉండటంతో అతడిని మందలించి వదిలేసినట్లు తెలుస్తోంది. -
ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్ కళాశాల ర్యాగింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్పల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేయగా.. మరో అయిదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహ్మద్ ఇమాద్, సోహైల్, వర్షిత్, గణేష్, వాసుదేవ్ వర్మ నే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇంత జరిగిన నిర్లక్ష్యంగా వ్యవహరించినా కాలేజీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారు. కాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి(ఐబీఎస్) కళాశాలలో విద్యార్థి హిమాంక్ బన్సాల్‌పై సీనియర్లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన జరిగిన ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక్క విద్యార్థిని లక్ష్యంగా చేసుకొని దాదాపు 10 మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. హాస్టల్ గధిలో బంధించి బాధితుడిపై కూర్చొని, పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలను వీడియో తీయగా.. బాధిత విద్యార్థి దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కళాశాల యాజమాన్యం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దాడికి పాల్పడిన 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. కారణం అదేనా! అయితే ఐసీఎఫ్ఏఐ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. కొంతకాలం లవ్ చేసుకున్నాక వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని అవమానిస్తూ పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తన బంధువైన సీనియర్ విద్యార్థికి చెప్పింది. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. అతడు తన స్నేహితులను వెంటబెట్టుకుని హాస్టల్లో ఉన్న యువకుడిపై దాడి చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ 15 నుంచి 20 మంది సీనియర్లు తన హాస్టల్ గదిలోకి చొరబడి కొట్టారని బన్సల్ ఫిర్యాదులో పేర్కొన్నారు -
‘జూనియర్’గా వస్తున్న గాలి జనార్దన్ రెడ్డి తనయుడు
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా దర్శకుడు రాధాకృష్ణ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర పోషించబోతుంది. వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించారు మేకర్స్. ఈచిత్రానికి ‘జూనియర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కిరిటీ బర్త్‌డేని పురస్కరించుకొని శుక్రవారం సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘చిన్నప్పటి నుంచి మనం ఏదో ఒకటి అయిపోదాం అనుకుంటాం. మనం అవ్వకపోయినా జీవితం ఏదో ఒకటి చేసేస్తుంది..’అంటూ సాగే ఈ వీడియో గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
జూనియర్ విద్యార్థినితో పరిచయం.. వాట్సాప్‌లో అశ్లీల దృశ్యాలు
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): యువతిని ప్రేమ పేరుతో నమ్మించి అశ్లీల దృశ్యాలను వాట్సాప్‌లో పెట్టి వికృతంగా వ్యవహరించిన యువకుడి ఉదంతం హుబ్లీలో వెలుగు చూసింది. మహారాష్ట్రలోని షిరిడీకి చెందిన యువకుడు హుబ్లీలో నర్సింగ్ కోర్సు చదువుతున్నాడు. తన జూనియర్ విద్యార్థినితో పరిచయం పెంచుకుని ఫోన్లో మాట్లాడుతూ ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. అనంతరం వాట్సాప్‌ద్వారా వీడియోకాల్ చేసి ఆమె నగ్న దృశ్యాలను రికార్డు చేశాడు. వాటిని ఎడిట్ చేసి ఫొటోలను ఈనెల 11న వాట్సాప్‌లో పెట్టాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
అప్రెంటిస్ నియామకాలకే మొగ్గు.. కంపెనీల కొత్త ఎత్తుగడ!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ద్వితీయార్థంలో (జులై–డిసెంబర్) అప్రెంటీస్లను గణనీయంగా తీసుకోవడంపై దేశీయంగా దాదాపు 45 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. జనవరి–జూన్ వ్యవధితో పోలిస్తే ఇది 4 శాతం అధికం. అప్రెంటిస్‌ల నియామకాల ద్వారా నిపుణులు, సిబ్బంది కొరత సమస్యను అధిగమించవచ్చని సంస్థలు భావిస్తున్నాయి. నేషనల్ ఎంప్లాయబిలిటీ థ్రూ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాం (టీమ్‌లీజ్ స్కిల్స్ యూనివర్సిటీలో భాగం) ఈ ఏడాది ద్వితీయార్థంపై రూపొందించిన అప్రెంటిస్‌షిప్ అంచనాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 64 శాతం కంపెనీలు ప్రస్తుతం తాము తీసుకుంటున్న అప్రెంటిస్‌ల సంఖ్యను మరింత పెంచుకోవాలని భావిస్తున్నాయి. ప్రథమార్ధంతో పోలిస్తే ఇది ఆరు శాతం అదికం. 14 నగరాల్లో, 18 రంగాలకు చెందిన 833 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. వీటిలో 17 రంగాల్లో అప్రెంటిస్‌ల నియామకాలపై ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. హైరింగ్ విషయంలో తయారీ.. ఇంజినీరింగ్ (68 శాతం), రిటైల్ (58 శాతం), ఆటోమొబైల్.. అనుబంధ రంగాలు (58 శాతం) టాప్‌లో ఉన్నాయి. మెట్రో, మెట్రోయేతర నగరాల్లోనూ అప్రెంటిస్‌ల నియామకాలపై సానుకూల అంచనాలు ఉన్నాయి. మెరుగ్గా లక్నో, అహ్మదాబాద్.. మెట్రో నగరాలతో పోలిస్తే నియామకాల విషయంలో లక్నో (79 శాతం), అహ్మదాబాద్ (69 శాతం) మెరుగ్గా ఉన్నాయి. ఇక మెట్రో నగరాల్లో చెన్నై (65 శాతం), ఢిల్లీ (58 శాతం).. అప్రెంటిస్‌లకు ఆకర్షణీయంగా నిల్చాయి. మహిళలకన్నా (32 శాతం) పురుషులను (36 శాతం) నియమించుకోవడంపై కంపెనీలు ఎక్కువ ఆసక్తిగా ఉన్నాయి. వ్యవసాయ, తయారీ పరిశ్రమల్లో పురుషుల కన్నా (వరుసగా 29 శాతం, 28 శాతం) మహిళలకు (33 శాతం, 34 శాతం) అధిక ప్రాధాన్యం లభిస్తోంది. చదవండి: ఆన్‌లైన్‌లోకి ఆటో మొబైల్.. భారీగా నియామకాలు! -
పసిడి ‘పట్టు’ చిక్కలేదు కానీ...
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల పంట పండింది కానీ... పసిడి పట్టు ఎవరికీ చిక్కలేదు. అటు పురుషుల ఈవెంట్లో, ఇటు మహిళల విభాగంలో ఫైనల్ చేరిన భారత రెజ్లర్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. శుక్రవారం స్వర్ణం కోసం తలపడిన మహిళా రెజ్లర్లు సంజూ దేవి, భటేరిలు రజతాలతో సంతృప్తి చెందారు. 62 కేజీల కేటగిరీలో సెమీస్ దాకా ప్రత్యర్థులందరిపై ఆధిపత్యం చలాయించిన సంజూ దేవి తీరా ఫైనల్‌కొచ్చేసరికి పట్టు సడలించింది. రష్యా రెజ్లర్ ఎలీనా కసబియెవా 10–0 పాయింట్ల తేడాతో సంజూ ‘పసిడి’కలను కలగానే మిగిల్చింది. బౌట్లో సంజూకు ఏమాత్రం అవకాశమివ్వకుండా ఎలీనా తేలిగ్గా పడేసింది. 65 కేజీల ఫైనల్లో భటేరికి మాల్డొవా రెజ్లర్ ఇరినా రింగాసి చెక్ పెట్టింది. 12–2 తేడాతో భటేరిని ఓడించింది. కాంస్య పతక పోరులో నిలిచిన సనేహ్ (72 కేజీలు) గాయంతో విలవిలాడుతూ బౌట్ మధ్యలోనే వైదొలగింది. మరియమ్ గుసెనొవా (రష్యా) 3–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో మోకాలి గాయాన్ని భరించలేక సనేహ్ ఆటను కొనసాగించలేకపోయింది. ఈ టోర్నమెంట్లో మహిళా రెజ్లర్లు పురుషుల కంటే మెరుగైన ప్రదర్శనే ఇచ్చారు. 3 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించారు. పురుషుల కేటగిరీలో భారత్ 6 పతకాలు సాధించినప్పటికీ ఒక్కటి (రజతం) మినహా అన్నీ కాంస్యాలే ఉన్నాయి. గ్రీకో రోమన్ రెజ్లర్లు అంతా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. శుక్రవారం బరిలోకి దిగిన ఐదుగురు రెజ్లర్లలో ఏ ఒక్కరు సెమీస్ అయినా చేరలేకపోయారు. -
జూనియర్ల పంచ్‌కు డజను పతకాలు
న్యూఢిల్లీ: సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. ఈ టోర్నీలో భారత్ 12 పతకాలు సాధించింది. ఇందులో నాలుగేసి చొప్పున స్వర్ణ, రజత, కాంస్య పతకాలున్నాయి. దీంతో భారత బాక్సింగ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తమన్నా (48 కేజీలు), అంబేశొరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు), ప్రియాంక (66 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. ఫైనల్లో తమన్నా 5–0తో అలెనా ట్రెమసొవా (రష్యా)పై ఏకపక్ష విజయం సాధించడంతో ‘ఉత్తమ విదేశీ బాక్సర్’ కేటగిరీలో కూడా అవార్డు పొందింది. మిగతా ఫైనల్ బౌట్లలో అంబేశొరి 3–2తో డ్యునా సిపెల్ (స్వీడన్)పై, ప్రీతి దహియా 3–2తో క్రిస్టినా కర్టత్సెవా (ఉక్రెయిన్)పై నెగ్గారు. ప్రియాంక 5–0తో ఓల్గా పెట్రష్కొ (రష్యా)ను కంగుతినిపించింది. అంజూ దేవి (50 కేజీలు), సిమ్రన్ వర్మ (52 కేజీలు), మాన్సి దలాల్ (75 కేజీలు), తనిశ్‌బిర్ కౌర్ సంధు (80 కేజీలు) రజతాలు నెగ్గగా, ఆశ్రేయ (63 కేజీలు), నేహా (54 కేజీలు), ఖుషి (70 కేజీలు), అల్ఫియా (ప్లస్ 80 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. 20 దేశాలకు చెందిన 160 మందికి పైగా బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఇందులో 13 మంది సభ్యులతో కూడిన భారత బృందం 12 పతకాలు గెలుపొందడం విశేషం. -
సచిన్ రాఠి, దీపక్‌లకు స్వర్ణాలు
న్యూఢిల్లీ: జూనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సచిన్ రాఠి, దీపక్ పూనియా ‘పసిడి’ పట్టు పట్టారు. ఆదివారం ఇక్కడ జరిగిన 74 కేజీల ఫైనల్లో సచిన్ 9–2తో బియంబసురెన్ (మంగోలియా)ను ఓడించగా... 86 కేజీల తుదిపోరులో దీపక్ 10–0తో అజత్ గజ్యెవ్ (తుర్క్మెనిస్తాన్)పై గెలిచాడు. 61 కేజీల కేటగిరీ కాంస్య పతక పోరులో సూరజ్ రాజ్ కుమార్ 16–8తో యుతో (జపాన్)ను ఓడించి పతకం గెలుచుకున్నాడు. 92 కేజీల్లో సోమ్‌వీర్ సింగ్ నిరాశపరిచాడు. అతను మూడో రౌండ్లోనే 2–3తో తకుమా ఒత్సు (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. 125 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక బౌట్లో ఎర్డెనెబాటర్ (మంగోలియా)పై మోహిత్ 10–0తో గెలిచాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా భారత్ 173 పాయింట్లతో రెండో స్థానం పొందగా, ఇరాన్ (189)కు అగ్రస్థానం దక్కింది. -
జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’
పరిశీలిస్తున్నామన్న మంత్రి ఈటల రాజేందర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో కూడా సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రకటించారు. ప్రస్తుతం పాఠశాలలు, వసతి గృహాల్లో ఆ పథకం సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో సభ్యుల సూచన మేరకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైచిలుకు పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం వల్ల 29.8లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందు తున్నారని, వసతిగృహాల్లో మరో 6 లక్షల మంది విద్యార్థులకూ అమలు చేస్తున్నామని వివరించారు. ఈ బియ్యం కోసం కొంటున్న వడ్లకు రూ.1,800 చొప్పున ధర చెల్లిస్తున్నారని, అలాగే మిగతా రకాలకు కూడా అంతే మొత్తం చెల్లించి రైతులకు అండగా నిలవాలని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచించారు. -
జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’
-
జూనియర్ వైద్యుల ధర్నా
-
జూనియర్ వైద్యుల ధర్నా
గుంటూరు మెడికల్ : జూనియర్ వైద్యుల ధర్నాతో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల బుధవారం దద్దరిల్లింది. గైనకాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జీజీహెచ్‌లో జూనియర్ వైద్యులు ధర్నా చేశారు. డాక్టర్ సంధ్యారాణి చిత్రపటాన్ని పట్టుకుని, నల్లబ్యాడ్జీలు ధరించి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించారు. ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీడియాకు వివరణ ఇచ్చేందుకు డాక్టర్ లక్ష్మి అందుబాటులో ఉన్నారని, అయినా పోలీసులు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. పోలీసులు తక్షణమే స్పందించి ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాల వద్దకు ర్యాలీగా వెళ్లి తమకు న్యాయం చేయాలని అక్కడ ధర్నా చేశారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు జూడాల వద్దకు వచ్చి డాక్టర్ లక్ష్మిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపామని, ఆమెను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి జీజీహెచ్‌కు వచ్చి అర్ధరాత్రి వరకు ధర్నా కొనసాగించారు. డాక్టర్ సంధ్యారాణి భర్త కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్తలు రావడంతో రాత్రి పది గంటల సమయంలో ఆందోళన చేసుత్న్న జూనియర్ వైద్యులు తీవ్రంగా స్పందించారు. పోలీసులు, డాక్టర్ లక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విమర్శలకు ఖండన... గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మి తనపై వచ్చిన వార్తలకు స్పందిస్తూ మీడియాకు వివరణ ఇచ్చిన లేఖలో పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణిపై చేసిన ఆరోపణలను జూడాల సంఘం తీవ్రంగా ఖండించింది. డాక్టర్ సంధ్యారాణి బాగా సంతోషంగా అందరితో కలిసి ఉంటుందని, ప్రొఫెసర్ తప్పు చేసి, చనిపోయిన వైద్య విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జూనియర్ వైద్యులు చెప్పారు. డాక్టర్ సంధ్యారాణి ఏ తప్పు చేయలేదన్నారు. ఆస్పత్రి అధికారులు ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీపై తమకు నమ్మకం లేదని, అందరూ వైద్యులే కావడం వల్ల తమకు న్యాయం జరగదని పేర్కొన్నారు. డాక్టర్ సంధ్యారాణి మృతిపై జడ్జితో విచారణ చేయించాలని జూడాలు డిమాండ్ చేశారు. ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే వరకు తాము ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. డాక్టర్ సంధ్యారాణి కుటుం బానికి న్యాయం చేయాలని, ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎంఈ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, జీజీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.నాగేశ్వరరావు తెలిపారు. సూపరింటెండెంట్‌తో చర్చలు ఉదయం నుంచి రాత్రి వరకు ధర్నా చేస్తూ జూడాలు బైఠాయించటంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మెండా ఫర్నికుమార్ జూనియర్ డాక్టర్లను తమ చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మిపై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై తాము ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నామని, ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. డాక్టర్ లక్ష్మి ప్రవర్తన, ఆమెపై వచ్చిన ఆరోపణ గురించి విచారణ చేసేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ సభ్యులు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, జీజీహెచ్ డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పెనుగొండ యశోధర, జనరల్ మెడిసిన్ వైద్య విభాగాధిపతి డాక్టర్ మోహనరావు కలిసి పీజీ వైద్యులు, బోధనా సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది అందరితో మాట్లాడి నివేదిక తయారు చేసే పనిలో ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. గురువారం ఉదయంలోపు నివేదిక వస్తుందని, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు అందజేసి, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
జిల్లా జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల ఖోఖో ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు 70 మంది బాలురు, 50 మంది బాలికలు హాజరయ్యారు. బాలబాలికల నుంచి ఐదుగురు చొప్పున ఎంపిక చేశామని జిల్లా ఖోఖో అసోసియేషన్ ఇన్చార్జ్ కార్యదర్శి పి.రామయ్య తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు బుధవారం హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో ఎంపికల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాస్థాయి ఎంపికల్లో పీఈటీలు పి.నర్సయ్య, ఎ.కృష్ణ, రాజు, చలపతి పాల్గొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు బాలుర జట్టులో కె.అవినాష్, ఎం.నవీన్, పి.బాబురావు, పి.కార్తీక్, సీహెచ్.కృష్ణసాగర్, బాలికల జట్టులో జి.రేణుక, పి.అనూష, ఎ.ప్రియాంక, కె.ముక్తేశ్వరీ, టి.లక్ష్మిప్రసన్న ఉన్నారు. -
రేపు కాంట్రాక్ట్ లెక్చరర్ల జిల్లా సమావేశం
వర్ని : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలపై ఆదివారం కామారెడ్డిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చిన్న గంగాధర్ శుక్రవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. అయితే రెండేళ్లు గడుస్తున్నా హామీని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి జిల్లాలోని సభ్యులందరూ హాజరుకావాల్సిందిగా ఆయన కోరారు. -
డెంటల్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచార యత్నం
-
సీక్వెల్‌కు నో!
ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సీక్వెల్ బాటలో పరుగెడుతుంటే... హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వాజినెగర్ మాత్రం అందుకు నో అంటున్నాడు. 1994లో రిలీజైన అతడి చిత్రం ‘జూనియర్’కు సీక్వెల్ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. కారణం ఏంటని ఆరా తీస్తే... అందులో అతడి క్యారెక్టరేనని తేలింది. అప్పట్లో ఈ చిత్రంపై పెద్ద దుమారమే రేగింది కూడా. ‘ఏదైనా రియాలిటీకి దగ్గరగా ఉండాలి. సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయగలిగేలా ఉండాలి. లేదంటే ఆ ప్రయత్నమంతా నిష్ర్పయోజనమే’ అంటూ చెప్పుకొచ్చాడు ఆర్నాల్డ్. -
కళాశాల భవనంపైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య