జిల్లా జూనియర్‌ ఖోఖో జట్ల ఎంపిక | elected district koko teams | Sakshi
Sakshi News home page

జిల్లా జూనియర్‌ ఖోఖో జట్ల ఎంపిక

Sep 6 2016 11:58 PM | Updated on Sep 4 2017 12:26 PM

జిల్లా జట్టు

జిల్లా జట్టు

జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జిల్లాస్థాయి జూనియర్‌ బాలబాలికల ఖోఖో ఎంపికలు నిర్వహించారు.

ఖమ్మం స్పోర్ట్స్‌ : జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జిల్లాస్థాయి జూనియర్‌ బాలబాలికల ఖోఖో ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు 70 మంది బాలురు, 50 మంది బాలికలు హాజరయ్యారు. బాలబాలికల నుంచి ఐదుగురు చొప్పున ఎంపిక చేశామని జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి పి.రామయ్య తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు బుధవారం హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్‌ ఖోఖో ఎంపికల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాస్థాయి ఎంపికల్లో పీఈటీలు పి.నర్సయ్య, ఎ.కృష్ణ, రాజు, చలపతి పాల్గొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు బాలుర జట్టులో కె.అవినాష్, ఎం.నవీన్, పి.బాబురావు, పి.కార్తీక్, సీహెచ్‌.కృష్ణసాగర్, బాలికల జట్టులో జి.రేణుక, పి.అనూష, ఎ.ప్రియాంక, కె.ముక్తేశ్వరీ, టి.లక్ష్మిప్రసన్న ఉన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement