
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జూనియర్’. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపించగా.. జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూలై 18న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ నేపథ్యంలోనే హీరో కిరిటీ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ చిత్రంలోని ఓ సీన్‌కు సంబంధించిన ఒరిజినల్ షూట్ వీడియోను పంచుకున్నారు. కారుపై నుంచి కిరిటీ జంప్ చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించాడో ఈ వీడియోలో చూపించారు. ఈ షూటింగ్ స్టంట్ కోసం కష్టపడిన పీటర్ హెయిన్ మాస్టర్‌తో పాటు సిబ్బందికి హీరో ధన్యవాదాలు తెలిపారు. ఫైనల్‌గా రిజల్ట్ ఇలా వచ్చిందంటూ వీడియోలో మూవీ సీన్ చూపించారు. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.
Behind the making of my stunt in #Junior
Thanks to Peter Hein Master and all the stunt crew for ensuring my safety. pic.twitter.com/ua7eDQ08Eh— Kireeti (@KireetiOfficial) July 22, 2025