
సినిమా కోసం నటీనటులు కొన్నిసార్లు డేంజరస్ స్టంట్లు చేస్తుంటారు. అయితే మంజు వారియర్ రెండో సినిమాకే అలాంటి సాహస సన్నివేశంలో నటించిందట! ఆ సమయంలో తాను లేకపోతే సినీ ఇండస్ట్రీ గొప్ప నటి మంజు వారియర్ (Manju Warrier)ను కోల్పోయేదంటున్నాడు నటుడు మనోజ్ కె జయన్. మనోజ్, మంజు వారియర్ సల్లపం (1996) అనే మలయాళ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రాధగా మంజు నటనకు విశేష గుర్తింపు వచ్చింది.

సల్లపం మూవీ
రైలు కింద పడేది
అయితే సల్లపం షూటింగ్‌లో జరిగిన ఓ అనుభవాన్ని తనెప్పటికీ మర్చిపోలేనంటున్నాడు మనోజ్ (Manoj K Jayan). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మంజు వారియర్‌కు హీరోయిన్‌గా సల్లపం తొలి చిత్రం. క్లైమాక్స్‌లో హీరోయిన్ ఆత్మహత్యకు ప్రయత్నించాల్సి ఉంటుంది. వేగంగా వెళ్తున్న రైలు చక్రాల కిందపడేందుకు ప్రయత్నిస్తే నేను వెళ్లి ఆపాలి. మంజు తన పాత్రలో పూర్తిగా లీనమైపోయి నిజంగానే పట్టాలపై దూకేందుకు ట్రై చేసింది.
శక్తినంతా కూడదీసుకున్నా..
ఎటువంటి ఘోరం జరగకూడదని మనసులో ధృడంగా నిశ్చయించుకున్నాను. నా శక్తినంతా కూడదీసుకుని తనను గట్టిగా పట్టుకుని వెనక్కు లాగాను. ఏమాత్రం పట్టుతప్పినా తను రైలు కింద పడిపోయేది. షూట్ అయిపోగానే నాకు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. తనను తిట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆ షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చిందని చిత్రయూనిట్ మెచ్చుకున్నారు. నేను ఆరోజు అక్కడ లేకపోయుంటే మలయాళ ఇండస్ట్రీ ఓ గొప్ప నటిని కోల్పోయేది అని చెప్పుకొచ్చాడు.

సినిమా
సల్లపం సినిమా (Sallapam Movie)లో దిలీప్‌తో ప్రేమలో పడ్డ మంజు వారియర్ రియల్ లైఫ్‌లోనూ అతడినే ప్రేమించింది. 1998లో దిలీప్‌ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి ఫ్యామిలీకే సమయం కేటాయించింది. అయితే దిలీప్- మంజు వారియర్ 2015లో విడాకులు తీసుకున్నారు. అప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మంజు ప్రస్తుతం తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇటీవల ఎల్2: ఎంపురాన్ అనే బ్లాక్‌బస్టర్ చిత్రంలో కనిపించింది.
చదవండి: బతికుండగానే చంపేశారు.. అమ్మానాన్న ఒకటే కంగారు: శిల్ప