
అంగడి తెరు (Angadi Theru).. 2010లో వచ్చిన హిట్ మూవీ. ఇది తెలుగులో షాపింగ్ మాల్ (Shopping Mall Movie) పేరిట డబ్ అయి ఇక్కడా విజయం సాధించింది. ఈ సినిమాకుగానూ తెలుగమ్మాయి అంజలి తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు అందుకుంది. అలాగే సౌత్ ఫిలింఫేర్ పురస్కారం సైతం గెలుచుకుంది. చెన్నైలోని టీ నగర్‌లో బట్టల దుకాణంలో పని చేసే ఉద్యోగుల సమస్యలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు.
సినిమాతో గుర్తింపు, పెళ్లి
మహేశ్, అంజలి (Anjali) హీరోహీరోయిన్లుగా నటించారు. వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి విజయ్ ఆంటోని, జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. ఈ మూవీలో అంజలి స్నేహితురాలిగా నటి సుగుణ యాక్ట్ చేసింది. అంజలితో పాటు తను కూడా బట్టల షాప్‌లో దుస్తులు అమ్ముతూ ఉంటుంది. ఈ మూవీకి అసోసియేట్ దర్శకుడిగా పని చేసిన నాగరాజన్‌ను పెళ్లి చేసుకుంది.

నల్లగా ఉన్నా, నన్నెవరు ఇష్టపడతారు?
అయితే షాపింగ్ మాల్ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి సుగుణ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత సినిమాలు చేయడం నా భర్తకు ఇష్టం లేదు, అందుకే వెండితెరపై మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకుని నడుపుతున్నాను. నేను నల్లగా ఉండటం వల్ల అందంగా లేనని బాధపడేదాన్ని. ఎవరూ నన్ను ప్రేమించరని అనుకునేదాన్ని. కానీ పెళ్లి తర్వాత ఆ ఆలోచనే పోయింది.
బాధ తట్టుకోలేకపోయా..
నన్ను ప్రేమించే భర్త దొరికాడు. అతడు వచ్చాక నా జీవితమే మారిపోయింది. అయితే పెళ్లయిన కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నిలవలేదు. ఎనిమిదో నెలలో కడుపులోనే బిడ్డ చనిపోయింది. ఆ బాధ తట్టుకోలేకపోయాను. కానీ, అప్పుడు నా భర్త సపోర్ట్‌గా నిలబడ్డాడు. తర్వాత మాకు ఓ కొడుకు పుట్టాడు అని సుగుణ చెప్పుకొచ్చింది.
చదవండి: ఏయ్ బాబూ, ఫోన్ తీయ్.. హీరో వార్నింగ్.. వీడియో వైరల్