హారర్‌ థ్రిల్లర్‌గా ‘హ్రీం’ .. షూటింగ్‌ పూర్తి | Horror thriller Hreem Movie Latest Update | Sakshi
Sakshi News home page

హారర్‌ థ్రిల్లర్‌గా ‘హ్రీం’ .. షూటింగ్‌ పూర్తి

Jan 28 2026 6:14 PM | Updated on Jan 28 2026 6:22 PM

Horror thriller Hreem Movie Latest Update

పవన్‌ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న నూతన చిత్రం ‘హ్రీం’. రాజేశ్‌ రావూరి ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్‌ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాధను ఆధారంగా తీసుకుని ఈ చిత్రానిన తెరకెక్కిస్తున్నారు.  హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన  ఈ చిత్రం వరంగల్, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. 

వరంగల్‌ దగ్గరలోని పెద్ద పెండ్యాల గ్రామంలో తొలి షెడ్యూల్, హైదరాబాద్‌ హెచ్‌యంటీ కాలనీలోని ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కీలక పాత్రల్లో ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, రాజీవ్‌ కనకాల, బెనర్జీ, భద్రం, అనింగి రాజశేఖర్‌ (శుబోదయం సుబ్బారావు), త్రిపురనేని శ్రీవాణి, పూజారెడ్డి, వనితా రెడ్డి తదితరులు నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement