మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ హీరోగా రాణిస్తూ తండ్రిగి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరు కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలో రాణిస్తోంది. కాకపోతే తండ్రి, తమ్ముడిలా యాక్టింగ్‌ను కాకుండా తనకంటూ ఓ కొత్త పంథాను ఎంచుకుంది. మొదట్లో చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ తర్వాత నిర్మాతగా మారింది.
రాఖీ పండక్కి కానుకలు
తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో నిర్మాతగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సుస్మిత కూడా చురుకుగా పాల్గొంటోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఏడాది రాఖీ పండక్కి రామ్‌చరణ్ నాకు ఏదో ఒక బహుమతిస్తుంటాడు. నాకు ఇష్టమైనవి తెలుసుకుని మరీ కొనిస్తాడు.
దిష్టి తగులుతుందని..
రాఖీ పండగ అనే కాదు.. తనకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఒక బహుమతి ఇస్తూనే ఉంటాడు. మన శంకరవరప్రసాద్‌గారు సక్సెస్ అయ్యాక ఈవిల్ ఐ అని ఒక లాకెట్ చైన్ గిఫ్టిచ్చాడు. సినిమా చాలా సక్సెస్ అయింది. నీకు దిష్టి తగులుతుంది అక్కా, వేసుకో అని చెప్పి మరీ ఆ లాకెట్ ఇచ్చాడు అని సుస్మిత చెప్పుకొచ్చింది.
చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు.. పారితోషికం ఎంతో బయటపెట్టిన హర్షవర్ధన్


