దురంధర్‌ అరుదైన రికార్డ్.. పుష్ప-2, బాహుబలి-2 తర్వాత..! | Ranveer Singh Dhurandhar is 1st Bollywood film to earn 1000 crore | Sakshi
Sakshi News home page

Dhurandhar Movie: దురంధర్‌ అరుదైన రికార్డ్.. పుష్ప-2, బాహుబలి-2 తర్వాత..!

Jan 28 2026 4:42 PM | Updated on Jan 28 2026 4:59 PM

Ranveer Singh Dhurandhar is 1st Bollywood film to earn 1000 crore

రణ్‌వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది.

తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. ఇండియాలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్‌-2 చిత్రాన్ని దాటేసింది. పుష్ప-2, బాహుబలి-2 సినిమాల తర్వాత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇండియాలో రూ.1002 కోట్ల వసూళ్లు సాధించింది. మనదేశంలో వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి బాలీవుడ్ మూవీగా అవతరించింది. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'(రూ.760) పేరిట ఉన్న ఈ రికార్డ్‌ను తుడిచిపెట్టేసింది.

అరుదైన రూ.1000 కోట్ల క్లబ్

రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్' మూవీతో పాటు కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ జాబితాలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్'(రూ.1,471 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి- 2: ది కన్‌క్లూజన్ (రూ.1417 కోట్లు) రెండోస్థానంలో ఉంది. ఈ జాబితాలో మూడో చిత్రంగా దురంధర్(రూ.1002) నిలిచింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రం   కేజీఎఫ్ చాప్టర్ 2(రూ.1001) కోట్లతో నాలుగో ప్లేస్‌ దక్కించుకుంది.


కాగా..  ఈ స్పై థ్రిల్లర్‌కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇందులో రణ్‌వీర్ ప్రధాన పాత్రలో నటించగా.. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సీక్వెల్‌గా ధురందర్ -2 మార్చిలో విడుదల కానుంది.

భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు

1    పుష్ప 2    -రూ.1471 కోట్లు
2    బాహుబలి 2-    రూ.1417 కోట్లు
3    ధురందర్-    రూ.1002 కోట్లు
4    కేజీఎఫ్ చాప్టర్ 2-    రూ.1001 కోట్లు
5    ఆర్ఆర్ఆర్-    రూ.916 కోట్లు
6    కల్కి 2898 ఏడీ-    రూ.767 కోట్లు
7    జవాన్-    రూ.760 కోట్లు
8    కాంతార చాప్టర్ 1-    రూ.741 కోట్లు
9    ఛావా-    రూ.716 కోట్లు
10    స్త్రీ 2-    రూ.713 కోట్లు

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement