బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉంది. ఓపక్క సినిమా ఈవెంట్స్ చేస్తూ మరో పక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె ఓ సినిమా చేసింది. సుహాస్ హీరోగా నటిస్తున్న హే భగవాన్ మూవీలో స్రవంతి ఓ కీలక పాత్ర పోషించింది. బుధవారం (జనవరి 28న) హే భగవాన్ సినిమా టీజర్ రిలీజైంది.
2009లో ఇండస్ట్రీకి..
ఈ సందర్భంగా యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. నటిగా ఇది నా ఫస్ట్ స్పీచ్.. కాబట్టి ముందు నా గురించి చెప్తాను. నా పేరు స్రవంతి చొక్కారపు. అనంతపురం జిల్లాలోని కదిరి నా స్వస్థలం. నటి అవ్వాలన్న ఆశతో 2009లో ఇండస్ట్రీకి వచ్చాను. కానీ నటి అవడానికి ఇన్నేళ్లు పట్టింది. హే భగవాన్‌తోనే నటిగా లాంచ్ అవాలని రాసిపెట్టుందేమో!
ఆడిషన్ చేయకుండా..
దర్శకుడు గోపి ఒక్క ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను సెలక్ట్ చేశారు. నేరుగా షూటింగ్‌కే పిలిచి ఆయనకు కావాల్సినట్లు నటించేలా చేశారు. ఈ మూవీలో నేనే సర్‌ప్రైజ్. సుహాస్ చాలా తక్కువగా మాట్లాడతారు. అయితే ఒక సీన్ కోసం నాకు చాలా సపోర్ట్ చేశారు. యాంకర్‌గా నన్ను ఎలా నిలబెట్టారో నటిగా కూడా అలాగే నిలబెడతారని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.
ఆ సినిమా సంగతేంటి?
ఇది చూసినవాళ్లు తనకు కంగ్రాట్స్ చెప్తున్నారు. అయితే స్రవంతి గతంలోనే నటిగా మారింది. బ్యాడ్ గాళ్స్ మూవీలో యాక్ట్ చేసింది. ఈ మూవీ వచ్చి ఎంతోకాలం అవలేదు. గతనెలలోనే విడుదలైంది. 2025 డిసెంబర్ 25న రిలీజైన ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. బహుశా అందుకేనేమో.. దాన్ని పక్కనపెట్టి హే భగవాన్ తన తొలి సినిమా అని చెప్తోందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. తల్లితో అదే చివరి సంక్రాంతి!


