బుల్లితెర జంట సుష్మ- కిరణ్ ఓ విషాదవార్తను పంచుకున్నారు. సంక్రాంతి పండగ సమయంలో తమ ఇంట్లో ఓ విషాదం జరిగినట్లు తెలిపారు. సుష్మ తల్లి సుశీల చనిపోయినట్లు వెల్లడించారు. ఈ మేరకు రవికిరణ్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
ఆమె మరణంతో విషాదం
సంక్రాంతి పండక్కి మేమంతా ఆనందంగా గడిపాం. వాటిని వీడియోలు కూడా తీసుకున్నాం. కానీ అంతలోనే మా ఇంట్లో ఓ విషాదం జరిగింది. జనవరి 22న మా అత్తయ్య (సుష్మ తల్లి) చనిపోయారు. మేమంతా అదే బాధలో ఉన్నాం. అందుకే ఆ వీడియోలను పోస్ట్ చేసేందుకు మనసు రావడం లేదు.
అవే చివరి రోజులు
అయితే ఈ సంక్రాంతి పండగ.. సుష్మ తన తల్లితో గడిపిన చివరి రోజులు. ఆ జ్ఞాపకాలను మీతో పంచుకునేందుకు నెమ్మదిగా వాటిని రిలీజ్ చేస్తాం. ఫిబ్రవరి 2న పెద్ద కర్మ ఉంది. ఆ తర్వాత సుష్మ తండ్రిని హైదరాబాద్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అని పేర్కొన్నాడు. సుష్మ-కిరణ్.. చిన్న సిరీయల్‌లో జంటగా నటించారు. ప్రస్తుతం ఇద్దరూ వేరే సీరియల్స్ చేస్తున్నారు.
చదవండి: సినిమా బ్లాక్‌బస్టర్.. రామ్‌చరణ్ ఏం గిఫ్టిచ్చాడంటే?: సుస్మిత


