breaking news
Hey Bhagavan
-
ఆ సంఘటన తర్వాత అందరు చీరల్లోనే: వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హే భగవాన్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన హగ్ డే సందర్భంగా మాట్లాడారు. స్టేజీపై ఉన్న ఇద్దరు హీరోయిన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ హగ్ డే కావడంతో మిమ్మల్ని హగ్ చేద్దామని వచ్చాను.. కానీ మీరిద్దరు చీరలు కట్టుకుని వచ్చారని అన్నారు. కొన్ని సంఘటనల ప్రతి ఒక్కరూ చీరలు కట్టుకుని వస్తున్నారన్నారు.కాగా.. గతంలో దండోరా మూవీ ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి శివాజీ మాట్లాడిన భాషపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలొచ్చాయి. అనసూయ, చిన్మయి లాంటి ఈ వివాదంపై నోరు విప్పారు. డ్రెస్ అనేది మహిళల ఛాయిస్ అని తమ వాయిస్ వినిపించారు. ఆ తర్వాత తన కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తన వాడిన ఆ రెండు పదాలకు మాత్రమేనని క్షమాపణలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనను ఉద్దేశించి తాజాగా వీకే నరేశ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. సుహాస్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా హే భగవాన్. ఈ చిత్రంలో శివాని నాగారం హీరోయిన్గా కనిపించనుంది. గోపి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ మూవీలో వీకే నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. -
'హే భగవాన్' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
2009లో ఇండస్ట్రీలోకి.. ఇన్నాళ్లకు నటిగా..: స్రవంతి స్పీచ్
బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉంది. ఓపక్క సినిమా ఈవెంట్స్ చేస్తూ మరో పక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె ఓ సినిమా చేసింది. సుహాస్ హీరోగా నటిస్తున్న హే భగవాన్ మూవీలో స్రవంతి ఓ కీలక పాత్ర పోషించింది. బుధవారం (జనవరి 28న) హే భగవాన్ సినిమా టీజర్ రిలీజైంది. 2009లో ఇండస్ట్రీకి..ఈ సందర్భంగా యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. నటిగా ఇది నా ఫస్ట్ స్పీచ్.. కాబట్టి ముందు నా గురించి చెప్తాను. నా పేరు స్రవంతి చొక్కారపు. అనంతపురం జిల్లాలోని కదిరి నా స్వస్థలం. నటి అవ్వాలన్న ఆశతో 2009లో ఇండస్ట్రీకి వచ్చాను. కానీ నటి అవడానికి ఇన్నేళ్లు పట్టింది. హే భగవాన్తోనే నటిగా లాంచ్ అవాలని రాసిపెట్టుందేమో!ఆడిషన్ చేయకుండా..దర్శకుడు గోపి ఒక్క ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను సెలక్ట్ చేశారు. నేరుగా షూటింగ్‌కే పిలిచి ఆయనకు కావాల్సినట్లు నటించేలా చేశారు. ఈ మూవీలో నేనే సర్ప్రైజ్. సుహాస్ చాలా తక్కువగా మాట్లాడతారు. అయితే ఒక సీన్ కోసం నాకు చాలా సపోర్ట్ చేశారు. యాంకర్‌గా నన్ను ఎలా నిలబెట్టారో నటిగా కూడా అలాగే నిలబెడతారని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. తల్లితో అదే చివరి సంక్రాంతి! -
ఇంతకీ ఏంటా బిజినెస్? కామెడీగా 'హే భగవాన్' టీజర్
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాలతో ఆకట్టుకున్న సుహాస్.. గతేడాది రెండు మూడు చిత్రాలు చేశాడు గానీ హిట్ పడలేదు. ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే 'హే భగవాన్'. గతంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సుహాస్ పాటు నటించిన శివానీ నాగారం.. ఇందులోనూ హీరోయిన్గా చేసింది. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేయడంతో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: మెగా ట్విన్స్ రాబోతున్నారు.. డేట్ కూడా ఫిక్స్!)గ్లింప్స్ అయితే కామెడీగా ఉంది. తండ్రి చేస్తున్న బిజినెస్‌ని పెద్దయ్యాక టేకోవర్ చేస్తానని చిన్నప్పుడే ఫిక్స్ అయిన హీరో.. పెద్దయ్యాక ఏం తెలుసుకున్నాడు? ఇతడికి పరిచయమైన హీరోయిన్ ఎవరు? అనేది స్టోరీలా అనిపిస్తుంది. హీరో తండ్రిగా నరేశ్ కనిపించనున్నారు. అయితే ఆ బిజినెస్ ఏంటనేది పక్కనబెడితే టీజర్లో కామెడీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 20న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ) -
పూరి కొత్త సినిమా 'హే భగవాన్'..!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టేస్తాడు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో కెరీర్ ఇబ్బందుల్లో పడ్డా, పూరిలో స్పీడు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే రోగ్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసిన పూరి.. బాలకృష్ణ హీరోగా మరో సినిమా షూటింగ్ ప్రారంభించాడు. ఇప్పటికే బాలయ్యతో చేస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన పూరి, ప్రస్తుతం రోగ్ సినిమా ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాడు. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న రోగ్, ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన పూరి, తన తదుపరి ప్రాజెక్ట్ విశేషాలను వెల్లడించాడు. బాలయ్య సినిమా తరువాత హే భగవాన్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టుగా తెలిపాడు పూరి. దేవుళ్ల కారణంగా ఈ ప్రపంచానికి ఎలాంటి కష్టాలు వస్తున్నాయో ఆ సినిమాలో చూపిస్తానంటున్నాడు. ఇప్పటికే ఇలాంటి వివాదాస్పద అంశాలను ఎంచుకొని చాలా మంది దర్శకులు ఇబ్బంది పడ్డారు. మరి పూరి ఈ సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను ఎలా డీల్ చేస్తాడో చూడాలి.


