కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాలతో ఆకట్టుకున్న సుహాస్.. గతేడాది రెండు మూడు చిత్రాలు చేశాడు గానీ హిట్ పడలేదు. ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే 'హే భగవాన్'. గతంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సుహాస్ పాటు నటించిన శివానీ నాగారం.. ఇందులోనూ హీరోయిన్‌గా చేసింది. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేయడంతో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.
(ఇదీ చదవండి: మెగా ట్విన్స్ రాబోతున్నారు.. డేట్ కూడా ఫిక్స్!)
గ్లింప్స్ అయితే కామెడీగా ఉంది. తండ్రి చేస్తున్న బిజినెస్‌ని పెద్దయ్యాక టేకోవర్ చేస్తానని చిన్నప్పుడే ఫిక్స్ అయిన హీరో.. పెద్దయ్యాక ఏం తెలుసుకున్నాడు? ఇతడికి పరిచయమైన హీరోయిన్ ఎవరు? అనేది స్టోరీలా అనిపిస్తుంది. హీరో తండ్రిగా నరేశ్ కనిపించనున్నారు. అయితే ఆ బిజినెస్ ఏంటనేది పక్కనబెడితే టీజర్‌లో కామెడీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 20న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)


