మెగా ఫ్యామిలీలో సంబరాలకు టైమ్ దగ్గరపడినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్-ఉపాసన దంపతులు ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు గతేడాది దీపావళి టైంలో రివీల్ చేశారు. అప్పుడే సీమంతం కూడా చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఉపాసన డెలివరీ డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
(ఇదీ చదవండి: హైకోర్టులో 'మన శంకరవరప్రసాద్' నిర్మాతకు నిరాశ)
జనవరి 31నే మెగాకోడలు ఉపాసన.. కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని మాట్లాడుకుంటున్నారు. 2012లో చరణ్-ఉపాసన పెళ్లి చేసుకోగా.. దాదాపు పదకొండేళ్ల తర్వాత అంటే 2023 జూన్‌లో వీళ్లకు పాప పుట్టింది. ఆమెకు క్లీంకార అని పేరు పెట్టారు. ఇప్పుడు క్లీంకారకు తమ్ముళ్లు లేదా చెల్లెళ్లు రాబోతున్నారనమాట.
ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మార్చి చివరలో విడుదల ఉంటుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కానీ చెప్పిన తేదీకి రావడం కష్టమే అనిపిస్తుంది. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉన్న దృష్ట్యా వేసవి తర్వాతే అంటే జూన్ నెలలో ఈ మూవీ రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఉపాసన డెలివరీ తర్వాత చరణ్.. షూటింగ్‌కి బ్రేక్ ఇస్తే గనక 'పెద్ది' రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది.
(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)


