breaking news
Hreem Movie
-
‘హ్రీం’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
‘హ్రీం’ భయపెడుతూనే ఎంటర్టైన్ చేస్తుంది
పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘హ్రీం’. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రమ్ ముఖ్య పాత్రల్లో నటించారు. సుజాత మల్లాల సమర్పణలో రాజేష్ రావూరి దర్శకత్వంలో శివ మల్లాల నిర్మించారు. ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి అతిథులుగా హాజరై, టీజర్‌ను విడుదల చేశారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో ప్రేక్షకు లను భయపెడుతూ ఎంటర్టైన్ చేయబోతున్నారు’’ అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నటనకు మంచి ఆస్కారం ఉన్న ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని చెప్పారు పవన్. ‘‘ఈ సినిమాలో నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు రాజీవ్ కనకాల. ‘‘నేను కొత్త దర్శకుణ్ణి అయినా ఈ సినిమాలో నటించిన సీనియర్ నటులు బాగా హెల్ప్ చేశారు’’ అన్నారు రాజేష్ రావూరి. -
‘హ్రీం’ మూవీ హీరో పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
‘హ్రీం’ మూవీ స్టిల్స్
-
హారర్ థ్రిల్లర్‌గా ‘హ్రీం’ .. షూటింగ్ పూర్తి
పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న నూతన చిత్రం ‘హ్రీం’. రాజేశ్ రావూరి ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాధను ఆధారంగా తీసుకుని ఈ చిత్రానిన తెరకెక్కిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. వరంగల్ దగ్గరలోని పెద్ద పెండ్యాల గ్రామంలో తొలి షెడ్యూల్, హైదరాబాద్ హెచ్‌యంటీ కాలనీలోని ఫారెస్ట్ లొకేషన్స్‌లో సెకండ్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కీలక పాత్రల్లో ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రం, అనింగి రాజశేఖర్ (శుబోదయం సుబ్బారావు), త్రిపురనేని శ్రీవాణి, పూజారెడ్డి, వనితా రెడ్డి తదితరులు నటించారు. -
‘హ్రీం’ హిట్ కొట్టాలి: సందీప్ కిషన్
పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న నూతన చిత్రం ‘హ్రీం’. రాజేశ్ రావూరి ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరో సందీప్‌కిషన్ క్లాప్‌నివ్వగా నటులు అలీ, బెనర్జీ, తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఆడిటర్‌గా ఉన్న విజయేంద్రరెడ్డి, సినిజోష్ అధినేత రాంబాబు పర్వతనేని దర్శకుడు రాజేశ్‌కి స్క్రిప్ట్‌ని అందించారు. నటులు రాజీవ్ కనకాల కెమెరా స్విఛాన్ చేశారు.చిత్ర ప్రారంభోత్సవం తర్వాత సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘ నా తొలి చిత్రం నుండి ఈ చిత్ర నిర్మాతతో పరిచయం ఉంది. నాకున్న అతికొద్ది మంది మీడియా ఫ్రెండ్స్‌లో శివ మల్లాల ఎంతో ముఖ్యుడు. ఆయన తీస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ – ‘హ్రీం’ చిత్ర నిర్మాతలు శివమల్లాల , సుజాతలు నాకు కుటుంబ సభ్యులు. వారు నిర్మించ తలపెట్టిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా’ అన్నారు. నటుడు బెనర్జీ మాట్లాడుతూ–‘‘ ఈ సినిమాలో నేను చాలా మంచి పాత్రలో నటిస్తున్నా. తమ్ముడు శివ నాకు ఎంతో ఆప్తుడు. హీరో, హీరోయిన్ పవన్, చమిందా, దర్శకుడు రాజేశ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.రాజీవ్ కనకాల మాట్లాడుతూ– ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోసిస్తున్నాను. ‘హ్రీం’ చిత్ర హీరోయిన్ చమిందా వర్మ నటే కాదు. దుబాయ్ నుండి తెలుగులో నటించటానికి వచ్చిన తెలుగమ్మాయి. ఆమె డాక్టర్ కూడా. ఈ చిత్రంలో నటిస్తున్న పవన్ తాతా, దర్శకుడు రాజేశ్ నాకు ముందునుండి పరిచయం ఉంది. వారిద్దరికి ఎంతో టాలెంట్ ఉంది. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. నాకు 25 ఏళ్లున్నప్పటినుండి ‘హ్రీం’ చిత్ర నిర్మాత శివ మల్లాల నాకు తెలుసు. ఈ సినిమా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.


