
పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న నూతన చిత్రం ‘హ్రీం’. రాజేశ్ రావూరి ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరో సందీప్‌కిషన్ క్లాప్‌నివ్వగా నటులు అలీ, బెనర్జీ, తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఆడిటర్‌గా ఉన్న విజయేంద్రరెడ్డి, సినిజోష్ అధినేత రాంబాబు పర్వతనేని దర్శకుడు రాజేశ్‌కి స్క్రిప్ట్‌ని అందించారు. నటులు రాజీవ్ కనకాల కెమెరా స్విఛాన్ చేశారు.

చిత్ర ప్రారంభోత్సవం తర్వాత సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘ నా తొలి చిత్రం నుండి ఈ చిత్ర నిర్మాతతో పరిచయం ఉంది. నాకున్న అతికొద్ది మంది మీడియా ఫ్రెండ్స్‌లో శివ మల్లాల ఎంతో ముఖ్యుడు. ఆయన తీస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ – ‘హ్రీం’ చిత్ర నిర్మాతలు శివమల్లాల , సుజాతలు నాకు కుటుంబ సభ్యులు. వారు నిర్మించ తలపెట్టిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా’ అన్నారు. నటుడు బెనర్జీ మాట్లాడుతూ–‘‘ ఈ సినిమాలో నేను చాలా మంచి పాత్రలో నటిస్తున్నా. తమ్ముడు శివ నాకు ఎంతో ఆప్తుడు. హీరో, హీరోయిన్ పవన్, చమిందా, దర్శకుడు రాజేశ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ– ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోసిస్తున్నాను. ‘హ్రీం’ చిత్ర హీరోయిన్ చమిందా వర్మ నటే కాదు. దుబాయ్ నుండి తెలుగులో నటించటానికి వచ్చిన తెలుగమ్మాయి. ఆమె డాక్టర్ కూడా. ఈ చిత్రంలో నటిస్తున్న పవన్ తాతా, దర్శకుడు రాజేశ్ నాకు ముందునుండి పరిచయం ఉంది. వారిద్దరికి ఎంతో టాలెంట్ ఉంది. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. నాకు 25 ఏళ్లున్నప్పటినుండి ‘హ్రీం’ చిత్ర నిర్మాత శివ మల్లాల నాకు తెలుసు. ఈ సినిమా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.