పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘హ్రీం’. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రమ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
సుజాత మల్లాల సమర్పణలో రాజేష్ రావూరి దర్శకత్వంలో శివ మల్లాల నిర్మించారు.
ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి అతిథులుగా హాజరై, టీజర్‌ను విడుదల చేశారు.


