తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో ‘హ’, ‘ర’, ‘ఈ’, ‘మ’ అనే అక్షరాలున్నాయి. హ అంటే ధర్మం, ర అంటే అర్థం, ఈ అంటే కామం, మ అంటే మోక్షం..‘హ్రీం’ అంటే దర్మార్ధ కామ మోక్షాలు కలగలిసిన భీజాక్షరం.
ఇప్పటివరకు ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాధను ఆధారంగా తీసుకుని ఈ చిత్రానిన తెరకెక్కించారు. శివమ్‌మీడియా పతాకంపై ‘హ్రీం’ అనే భీజాక్షరంతో తయారైన ఈ సినిమాలో నూతన నటీనటులు పవన్ తాత, డాక్టర్ చమిందా వర్మ జంటగా నటించారు.
హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది.
‘ హ్రీం’ చిత్రానికి రాజేష్ రావూరి దర్శకుడు. శ్రీమతి సుజాత మల్లాల సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాత.


