‘హ్రీం’ భయపెడుతూనే ఎంటర్‌టైన్‌ చేస్తుంది | Hreem Movie Teaser Release Highlights | Sakshi
Sakshi News home page

‘హ్రీం’ భయపెడుతూనే ఎంటర్‌టైన్‌ చేస్తుంది

Jun 21 2026 3:39 PM | Updated on Jun 21 2026 4:09 PM

Hreem Movie Teaser Release Highlights

 పవన్‌ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘హ్రీం’. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజీవ్‌ కనకాల, బెనర్జీ, భద్రమ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. సుజాత మల్లాల సమర్పణలో రాజేష్‌ రావూరి దర్శకత్వంలో శివ మల్లాల నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ లాంచ్‌ కార్యక్రమానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి అతిథులుగా హాజరై, టీజర్‌ను విడుదల చేశారు. 

అచ్చిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో ప్రేక్షకు లను భయపెడుతూ ఎంటర్‌టైన్‌ చేయబోతున్నారు’’ అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నటనకు మంచి ఆస్కారం ఉన్న ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని చెప్పారు పవన్‌. ‘‘ఈ సినిమాలో నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు రాజీవ్‌ కనకాల. ‘‘నేను కొత్త దర్శకుణ్ణి అయినా ఈ సినిమాలో నటించిన సీనియర్‌ నటులు బాగా హెల్ప్‌ చేశారు’’ అన్నారు రాజేష్‌ రావూరి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement