
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)కు కోపమొచ్చింది. అభిమాని చేసిన ఓ దుందుడుకు చర్యకు తిక్కరేగింది. కోపం అణుచుకోలేక వెంటనే తన అభిమానికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే అక్షయ్ కుమార్ లండన్ వీధుల్లో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనపాటికి తను ప్రశాంతంగా వెళ్తుంటే ఓ అభిమాని అతడిని వెంబడించాడు.
అక్షయ్‌కు కోపమొచ్చింది
హీరో అనుమతి తీసుకోకుండా అక్షయ్‌ను వీడియో తీశాడు. ఇది గమనించిన అక్షయ్ కుమార్‌కు కోపమొచ్చింది. వెంటనే అభిమానివైపు నడుచుకుంటూ వచ్చి వీడియో ఎందుకు తీస్తున్నావని తిట్టాడు. వెంటనే కెమెరా ఆఫ్ చేయమంటూ బెదిరించాడు. అభిమాని ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఇదంతా వీడియో తీసిన ఫ్యాన్.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ప్రశాంతంగా బతకనివ్వరా?
అయితే ఇందులో మొదట కోప్పడ్డ అక్షయ్.. చివరకు అభిమానికి నవ్వుతూ సెల్ఫీ ఇచ్చాడు. నా ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించే క్రమంలో అక్షయ్ నన్ను తాకాడు. అద్భుతమైన అనుభవం అని సదరు అభిమాని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. వాళ్ల బతుకేదో వాళ్లను బతకనివ్వండి. ప్రశాంతంగా బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా వాళ్లకు లేదా? అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: బతికుండగానే చంపేశారు.. అమ్మానాన్న ఒకటే కంగారు: శిల్ప