
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం కార్ రేసింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు టైటిల్స్ గెలిచిన ఆయన టీమ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న కార్ రేసింగ్లో పాల్గొంటోంది. అయితే ఈ రేస్లో అజిత్ కారు డ్యామేజ్కు గురైంది. దీంతో అతని టీమ్ రేసు నుంచి నిష్క్రమించింది. ట్రాక్ పక్కనే తన కారును ఆపేసిన అజిత్ కుమార్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి.
ఇటలీలో జరుగుతున్న జీటీ4 యూరోపియన్ సిరీస్‌లో తన కారు ప్రమాదానికి గురి కావడంతో అజిత్ ట్రాక్ నిల్చుని ఉన్నారు. అక్కడే ఉన్న సిబ్బంది కారు డ్యామేజ్ కావడంతో విరిగినపడిన శిథిలాలను తొలగించేందుకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న అజిత్ కుమార్ వారికి సాయం చేశారు. కారు నుంచి ఊడిపోయి చెల్లాచెదురుగా పడిపోయిన వాటిని సిబ్బందికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అజిత్ కుమార్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంఘటన రెండవ రౌండ్ సమయంలో జరిగింది.
ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఏడాదిలో విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. వీటిలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ కీలక పాత్రలో కనిపించారు. సునీల్, ప్రభు, ప్రసన్న, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.
Out of the race with damage, but still happy to help with the clean-up.
Full respect, Ajith Kumar 🫡
📺 https://t.co/kWgHvjxvb7#gt4europe I #gt4 pic.twitter.com/yi7JnuWbI6— GT4 European Series (@gt4series) July 20, 2025