
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరో ఘనత సాధించారు. సినిమాలు మాత్రమే కాదు.. వరుస కార్ రేసింగ్‌లతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు టైటిల్స్ గెలిచిన అజిత్ టీమ్ మరో కప్ కొట్టేసింది. బెల్జియంలో నిర్వహించిన స్పా- ఫ్రాన్‌కోర్‌ఛాంప్స్ సర్క్యూట్‌లో అజిత్ టీమ్ రెండోస్థానంలో నిలిచింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది.
ఈ ఘనత సాధించడం పట్ల టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సైతం అభినందనలు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్‌లో అజిత్ టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటలీలో జరిగిన 12హెచ్ రేస్‌లోనూ మూడో స్థానం దక్కించుకుంది.
ఇక సినిమాల పరంగా చూస్తే ఇటీవలే యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ వచ్చింది. దీంతో వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద రాణించింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణస సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ నటుడు సునీల్, ప్రభు, సిమ్రాన్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించారు.
Congratulations to #AjithKumar sir and his team for the P2 podium finish at the prestigious Spa Francorchamps circuit in Belgium.
This is an amazing feat.
We are proud of you, sir. pic.twitter.com/KL88S6943L— Mythri Movie Makers (@MythriOfficial) April 20, 2025