
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నుంచి ఇప్పటికే చికిటు, మోనికా అంటూ సాగే రెండు పాటలను విడుదల చేశారు. మోనికా సాంగ్తో పూజా హెగ్డే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రిలీజ్ తేదీ దగ్గర పడనుండడంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్.
తాజాగా కూలీ మూవీ ప్రమోషన్లలో భాగంగా థర్డ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. పవర్ హౌస్ అంటూ సాగే పవర్‌ఫుల్ లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పవర్‌ఫుల్ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. వచ్చేనెల ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.