అజిత్ కుమార్ న్యూ లుక్‌.. షాకవుతున్న ఫ్యాన్స్! | Ajith Kumar new look takes internet Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Ajith Kumar: అజిత్ కుమార్ న్యూ లుక్‌.. షాకవుతున్న ఫ్యాన్స్!

Jun 24 2025 5:13 PM | Updated on Jun 24 2025 6:22 PM

Ajith Kumar new look takes internet Goes Viral In Social Media

ఈ ఏడాది గుడ్ బ్యాడ్ ‍అగ్లీ మూవీతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ స్టార్ అజిత్‌ కుమార్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష హీరోయిన్‌గా కనిపించింది.

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే అజిత్‌కు కారు రేసింగ్ అంటే ప్రాణం. ఇప్పటికే తన టీమ్‌తో కలిసి విదేశాల్లో టైటిల్స్ కూడా సాధించారు.  సినిమాలకు కాస్తా విరామం దొరకడంతో కార్ రేసింగ్‌లో బిజీ అయిపోయారు. అజిత్ కుమార్ ప్రస్తుతం బెల్జియంలో తన జీటీ4 యూరోపియన్ సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ వీకెండ్‌లో ఈ కార్ రేసింగ్‌ జరగనుంది.

అయితే తాజాగా అజిత్ కుమార్‌ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. రేసింగ్‌ ట్రాక్‌పై సైకిల్ తొక్కుతూ కనిపించారు. అయితే ఈ ఫోటోల్లో అజిత్ కుమార్‌ గుండు చేయించుకుని కొత్త లుక్‌తో దర్శనమిచ్చారు. తాజా లుక్‌ను చూసిన  అజిత్ ‍కుమార్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ఏడాది 'విదాముయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో మెప్పించి అజిత్ కుమార్‌ ప్రస్తుతం ఎలాంటి సినిమాను ప్రకటించలేదు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement