
‘మార్కో’ మూవీ ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. దర్శకుడు జోషి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఉన్ని ముకుందన్ ఫిలింస్ (యుఎమ్‌ఎఫ్)– ఐన్‌స్టీన్ మీడియా బ్యానర్లపై ఈ సినిమా రూపొందనుంది. దర్శకుడు జోషి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రకటించారు మేకర్స్. ‘‘హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది.
జోషి డైరెక్షన్ లో వచ్చిన పలు చిత్రాలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆ అనుభవంతో ఈ తరం స్టోరీ టెల్లింగ్ పవర్‌తో ఒక భారీ యాక్షన్ సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నారాయన. తన కెరీర్‌లో ఎప్పుడూ చూడని లుక్‌లో, మాస్ యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నారు ముకుందన్. యుఎమ్‌ఎఫ్– ఐన్‌స్టీన్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా బిగ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా నిలవబోతోంది’’ అని చిత్రబృందం తెలిపింది.