‘2018’ మూవీ ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పళ్లి చట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
కాగా మంగళవారం కయాదు లోహర్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ‘‘1950, 1960 దశకాల నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీ ‘పళ్లి చట్టంబి’. భారీ బడ్జెట్‌తో రూ పొందుతోన్న ఈ మూవీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త పాత్రలో టొవినో థామస్ కనిపించనున్నారు. ‘డ్రాగన్’ మూవీ సక్సెస్ తర్వాత కయాదు లోహర్‌కి ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్ మా సినిమాకి ప్లస్ కానుంది.
ఇటీవలే ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ‘పళ్లి చట్టంబి’ మోషన్ పోస్టర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని మేకర్స్ తెలి΄ారు. విజయ రాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెగ్జాండర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: టిజో టోమీ, సంగీతం: జేక్స్ బిజోయ్, అసోసియేట్ ప్రోడ్యూసర్స్: మేఘ శ్యామ్, తంజీర్.


