మహేశ్‌బాబుకు అతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది: ప్రముఖ ఎయిర్‌లైన్స్ పోస్ట్ | Tollywood Hero Mahesh babu Journey Photo With Airlines crew | Sakshi
Sakshi News home page

Mahesh babu: మహేశ్‌బాబుకు అతిథ్యం.. మా వాళ్లు ఫుల్ ఖుషీ: ఎయిర్‌లైన్స్ పోస్ట్ వైరల్

Jul 21 2025 7:31 PM | Updated on Jul 21 2025 8:02 PM

Tollywood Hero Mahesh babu Journey Photo With Airlines crew

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం బిగ్ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. తొలిసారి దర్శకధీరుడు రాజమౌళితో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్అడ్వెంచరస్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే మూవీని ఒడిశాలోని అందమైన లోకేషన్స్లో మొదటి షెడ్యూల్ను చిత్రీకరించారు. ప్రస్తుతం మూవీని ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29 వర్కింగ్‌ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు.

అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా విరామం లభించడంతో ప్రిన్స్ విదేశాల్లో చిల్ అవుతున్నారు. మన ప్రిన్స్ తరచుగా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్లకు వెళ్తుంటారు. ఇటీవల మహేశ్ బాబు శ్రీలంక ట్రిప్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోను ఏకంగా శ్రీలంక ఎయిర్లైన్స్తమ ట్విటర్హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దక్షిణ భారత సినీ స్టార్హీరో మహేష్ బాబును ఆహ్వానించడం మాకు, మా సిబ్బందికి ఆనందంగా ఉందంటూ మహేశ్బాబుతో సెల్పీ దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇంత గొప్ప అతిథిని మా విమానంలోకి ఆతిథ్యం ఇచ్చినందుకు మా సిబ్బంది ఎంతో సంతోషించారని తెలిపింది. మాతో పాటు శ్రీలంకకు ప్రయాణించినందుకు మహేశ్బాబుకు ధన్యవాదాలు తెలిపింది. పోస్ట్కాస్తా వైరల్ కావడంతో దట్ ఈజ్ప్రిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement