
2022లో వచ్చిన కన్నడ సినిమా 'కాంతార'.. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించారు. అలా దాదాపు మూడేళ్ల నుంచి షూటింగ్ సాగుతూనే ఉంది. ఇప్పుడు అది ఎట్టకేలకు పూర్తయింది. ఈ క్రమంలోనే కొత్త అప్‌డేట్ వచ్చేసింది. 'వరల్డ్ ఆఫ్ కాంతార' పేరిట ఓ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)
'కాంతార-1' మూవీ ఎలా ఉండబోతుంది? సెట్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఈ వీడియోలో చూచాయిగా చూపించారు. తొలి భాగంతో పోలిస్తే ఈసారి సెట్స్, గ్రాండియర్ కాస్త ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నా ఉరు, అక్కడి సంప్రదాయాలని చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని తీశానని, దీనికోసం మూడేళ్లపాటు కష్టపడ్డామని దాదాపు 250 రోజుల పాటు షూటింగ్ జరిపామని హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 2న మూవీ థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్)