
మెగా కోడలు ఉపాసన మరో వసంతంలోకి అడుగుపెట్టింది. భర్త రామ్ చరణ్‌తో కలిసి తన 37వ పుట్టినరోజుని ఇంట్లోనే సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోని చరణ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్‌లో చరణ్-ఉపాసనతో పాటు కూతురు క్లీంకార కూడా కనిపించింది. ఆమె ఫేస్ కూడా కాస్త రివీల్ అయింది.
(ఇదీ చదవండి: నా జీవితానికి వెలుగు నీవే.. సితారకు మహేశ్ బర్త్‌డే విషెస్)
సెలబ్రిటీలు చాలావరకు తమ తమ పుట్టినరోజుని విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చరణ్-ఉపాసన కూడా గతంలో వెళ్లారు. అయితే ఈసారి మరి చరణ్ షూటింగ్ షెడ్యూల్స్ వల్లనో ఏమో గానీ ఇంట్లోనే సింపుల్‌గా పుట్టినరోజు జరుపుకొన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ పోస్ట్ దిగువన మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఉపాసనకు విషెస్ చెబుతున్నారు.
చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. కొన్నిరోజుల ముందు వరకు ఢిల్లీ షూటింగ్ చేసొచ్చారు. ప్రస్తుతం ఎక్కడ జరుగుతుందనేది క్లారిటీ లేదు. ఈ మూవీ నుంచి ఇదివరకే రిలీజైన గ్లింప్స్ మంచి రెస్పాన్ అందుకుంది. వచ్చే ఏడాది మార్చి 27న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.
(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు)