నా జీవితానికి వెలుగు నీవే.. సితారకు మహేశ్‌ బర్త్‌డే విషెస్‌ | Mahesh Babu, Namrata Shirodkar Birthday Wishes to Sitara Ghattamaneni | Sakshi
Sakshi News home page

టీనేజ్‌లోకి సితార పాప.. నా ప్రపంచాన్ని మార్చింది నీవే!

Jul 20 2025 3:57 PM | Updated on Jul 20 2025 4:47 PM

Mahesh Babu, Namrata Shirodkar Birthday Wishes to Sitara Ghattamaneni

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గారాలపట్టి సితార (Sitara Ghattamaneni) బర్త్‌డే నేడు (జూలై 20). కూతురి పుట్టినరోజు పురస్కరించుకుని మహేశ్‌-నమ్రత దంపతులు సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్టులు పెట్టారు. క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్‌లో తీసుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన మహేశ్‌ (Mahesh Babu).. 'తనిప్పుడు టీనేజర్‌.. హ్యాపీ బర్త్‌డే సితార. నువ్వు నా జీవితంలో ఎప్పుడూ వెలుగులు నింపుతూనే ఉంటావు. లవ్యూ సో మచ్‌..' అని క్యాప్షన్‌ జోడించాడు.

నా ప్రపంచాన్ని మార్చేసిన చిన్నారి
నమ్రత.. సితార చిన్నప్పటి ఫోటోలతో పాటు ఇటీవలి కాలంలో తనతో దిగిన పిక్‌ను సైతం షేర్‌ చేసింది. 'నువ్వు ఎంత పెద్దదానివైనా.. నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసిన చిన్నారివి నీవే! హ్యాపీ బర్త్‌డే సితార.. ఐ లవ్యూ' అని రాసుకొచ్చింది. సితార అన్న గౌతమ్‌ కూడా చెల్లెలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. జీవితాన్ని మరింత సంతోషదాయకంగా మార్చే సితారకు హ్యాపీ బర్త్‌డే.. లవ్యూ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు చిన్నప్పటి ఫోటోను జత చేశాడు.

సితార వెరీ పాపులర్‌
కాగా సితార.. చిన్నప్పటి నుంచే సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌. పలు పాటలకు డ్యాన్సులు చేసి అలరించేది. ఇటీవలి కాలంలో తండ్రితో కలిసి వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తోంది. ఓ జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. ఈ జ్యువెలరీ యాడ్‌ అమెరికాలోని న్యూయార్క్‌లో టైమ్‌ స్క్వేర్‌ బోర్డ్‌పై ప్రత్యక్షం కావడంతో సితార పేరు తెగ మార్మోగిపోయింది. తన ఫస్ట్‌ రెమ్యునరేషన్‌ ఓ ఛారిటీకి విరాళంగా ఇచ్చేసి తండ్రిలాగే తనది కూడా గొప్ప మనసని నిరూపించుకుంది.

 

 

చదవండి: బాలీవుడ్‌ని వణికించిన మాఫియా డాన్‌ లవర్‌..ఎవరా హీరోయిన్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement