breaking news
kireeti Reddy
-
హీరోగా గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు.. టీజర్ చూశారా?
గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బ్యానర్లో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.మూవీ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే కాలేజీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా జులై 18న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో రవి చంద్రన్, జెనీలియా, రావు రమేష్, సుధారాణి, అచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. -
గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ‘జూనియర్’.. సాంగ్ రిలీజ్
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించగా, జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘లెట్స్ లివ్ దిస్ మూమెంట్... లెట్స్ లవ్ దిస్ మూమెంట్..’ అనే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను బెంగళూరులో నిర్వహించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలో శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను జస్ప్రీత్ జాజ్ పాడారు. విజయ్ పొలాకి నృత్య రీతులు సమకూర్చారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో కిరిటీ రెడ్డి మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా తీశాం. ‘జూనియర్’లోని ప్రతి మూమెంట్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో నాకు గాయమైంది. దాంతో కోలుకోడానికి ఏడాది పట్టింది. ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. లెజెండరీ యాక్టర్ వి. రవిచంద్రన్‌గారు మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఈ సినిమాలో నటించారు’’ అని తెలిపారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం కిరీటి చాలా హార్డ్ వర్క్ చేశాడు’’ అని తెలిపారు వి. రవిచంద్రన్. ‘‘రవిచంద్రన్, సెంథిల్, దేవిశ్రీప్రసాద్గార్లు వంటి సీనియర్స్ ఉండటం వల్ల మా ‘జూనియర్’ సినిమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పారు రాధాకృష్ణ. ‘‘కిరీటి యాక్షన్, డ్యాన్సింగ్ స్కిల్స్ చాలా సర్ప్రైజ్ చేశాయి. నటుడిగా అతనికి గొప్ప భవిష్యత్ ఉంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ వేడుకలో కొరియోగ్రఫర్ విజయ్ ΄ోలాకి, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ మాట్లాడారు. -
కిరీటి లుక్స్ బాగున్నాయి– రాజమౌళి
‘‘కిరీటిని పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. తన లుక్స్ చాలా బాగున్నాయి. నటుడికి కావాల్సిన అన్ని అర్హతలు కిరీటిలో ఉన్నాయి. నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ బాగా చేయగలడు. వారాహి బేనర్లో కిరీటి సినిమా చేయడం ఆనందంగా ఉంది. మంచి తారాగణం, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి అన్నారు. కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమవుతున్న చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. జెనీలియా, డాక్టర్ రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలనచిత్రం పతాకంపై తెలుగు–కన్నడ భాషల్లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి కన్నడ స్టార్ రవిచంద్రన్ వి. కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ– ‘‘నేను నటనకు దూరమై పదేళ్లయింది. కిరీటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాను’’ అన్నారు. ‘‘నేను సినిమాల్లోకి రావడానికి అప్పు సార్ (పునీత్ రాజ్‌కుమార్) స్ఫూర్తి. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అన్నారు కిరీటి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సెంథిల్ కుమార్. -
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న గాలి జనార్థన్‌రెడ్డి కొడుకు, దర్శకుడు ఎవరంటే..
Former Minister Gali Janardhan Reddy Son Kireeti Reddy To Debut In Films: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు. కన్నడలో డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు కిరీటీ రెడ్డి. కొడుకును హీరోగా చేసేందుకు గాలి జనార్థన్ కిరీటి రెడ్డికి నటన, డ్యాన్స్, ఫైటింగ్లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడట. కాగా రాధాకృష్ణ కన్నడలో మాయాబజార్ మూవీని తెరకెక్కించాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరక్కించబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక ఈ మూవీ గురించి డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘నటుడు కావాలన్నది కిరీటి కల. చదవండి: ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్‌కు అమెజాన్ ఒప్పందం ఎంతో తెలుసా? షాకవ్వాల్సిందే.. ఇప్పటికే అతడు యాక్టింగ్, డ్యాన్స్, ఫైటింగ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 'జాకీ' చిత్రం స్ఫూర్తితోనే కిరీటి సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు’ అని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా తెలుగులో లెజెండ్, యుద్ధం శరణం వంటి చిత్రాలను రూపొందించిన నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రానికి నిర్మాత వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ నాయకుల వారసులు సినిమాల్లోకి వచ్చిన సత్తా చాటుతున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్, జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, చెలువరాయ స్వామి తనయుడు సచిన్‌లు ఇప్పటికే హీరోలుగా పరిచమయ్యారు. చదవండి: ‘ఆచార్య’ మూవీ టీంకు షాక్, మెగాస్టార్ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు -
హీరోగా మైనింగ్ కింగ్ వారసుడు..?
తెలుగు రాష్ట్రలతో పాటు కర్ణాటకలోనూ మైనింగ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న గాలి జనార్థన్ రెడ్డి త్వరలో సినీరంగంలోకి అడుగుపెట్టబోతున్నారట. రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఈయన, త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు తన కొడుకు కిరీటి రెడ్డి హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు. ఇటీవల జరిగిన సోదరి వివాహ వేడుకలో తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్న కిరీటి నటనలోనూ శిక్షణ పొందాడు. ప్రస్తుతం కిరీటి హీరోగా తెరకెక్కబోయే సినిమాకు కథ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు గాలి ఫ్యామిలీ. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కూడా భారీ సినిమాతో పరిచయం అయినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అందుకే తన కుమారుడి విషయంలో అలాంటి పొరపాట్లు జరగకుండా గాలి జనార్థన్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కన్నడ పరిశ్రమ నుంచి కిరీటి రెడ్డి ఎంట్రీపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.