
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘లెట్స్ లివ్ దిస్ మూమెంట్... లెట్స్ లవ్ దిస్ మూమెంట్..’ అనే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను బెంగళూరులో నిర్వహించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలో శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను జస్ప్రీత్ జాజ్ పాడారు. విజయ్ పొలాకి నృత్య రీతులు సమకూర్చారు.

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో కిరిటీ రెడ్డి మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా తీశాం. ‘జూనియర్’లోని ప్రతి మూమెంట్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో నాకు గాయమైంది. దాంతో కోలుకోడానికి ఏడాది పట్టింది. ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. లెజెండరీ యాక్టర్ వి. రవిచంద్రన్‌గారు మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఈ సినిమాలో నటించారు’’ అని తెలిపారు.
‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం కిరీటి చాలా హార్డ్ వర్క్ చేశాడు’’ అని తెలిపారు వి. రవిచంద్రన్. ‘‘రవిచంద్రన్, సెంథిల్, దేవిశ్రీప్రసాద్‌గార్లు వంటి సీనియర్స్ ఉండటం వల్ల మా ‘జూనియర్’ సినిమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పారు రాధాకృష్ణ. ‘‘కిరీటి యాక్షన్, డ్యాన్సింగ్ స్కిల్స్ చాలా సర్‌ప్రైజ్ చేశాయి. నటుడిగా అతనికి గొప్ప భవిష్యత్ ఉంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ వేడుకలో కొరియోగ్రఫర్ విజయ్ ΄ోలాకి, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ మాట్లాడారు.