
గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటిస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీల కనిపించనుంది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో వరుస అప్‌డేట్స్‌తో మేకర్స్ అలరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జూనియర్ మూవీ నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. వైరల్ వయ్యారి అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో శ్రీలీల మరోసారి తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. పుష్ప-2లో ఐటమ్ సాంగ్ రేంజ్‌లో శ్రీలీల అలరించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. తాజాగా విడుదలైన పాట మాస్ ఆడియన్స్‌ను ఊపేస్తోంది. కాగా.. ఈ పాటను కల్యాణ్ చక్రవర్తి రాయగా.. హరిప్రియ, దేవిశ్రీ ప్రసాద్ ఆలపించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే.