
నిన్న అనగా శుక్రవారం రిలీజైన సినిమాల్లో కాస్తోకూస్తో 'జూనియర్' మంచి బజ్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ రావడంతో టికెట్స్ బాగానే సేల్ అయ్యాయి. కలెక్షన్ కూడా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇంతకీ ఈ మూవీ తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం.
కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ 'జూనియర్' అనే సినిమాని దాదాపు రెండు మూడేళ్ల క్రితం ప్రకటించారు. షూటింగ్ పూర్తయినా సరే చాలా ఆలస్యమైన ఈ చిత్రం.. ఎట్టకేలకు తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఈ వీకెండ్ చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేకపోవడంతో 'జూనియర్'కి ప్లస్ అయింది. అందుకు తగ్గట్లే తొలిరోజు రూ.1.4 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కన్నడ కంటే తెలుగులోనే ఎక్కువ మొత్తం వసూలు కావడం విశేషం.
(ఇదీ చదవండి: 'మెగా' లీకులు.. నిర్మాతలు గట్టి వార్నింగ్)
కిరీటి స్వతహాగా కన్నడ అయినప్పటికీ.. తెలుగులో 'జూనియర్' చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. దానికి శ్రీలీల ఓ కారణం కాగా, 'వైరల్ వయ్యారి' పాట తెగ వైరల్ కావడం మరో కారణం అని చెప్పొచ్చు. తొలిరోజు తెలుగులో రూ.1.25 కోట్లు రాగా.. కన్నడలో కేవలం రూ.15 లక్షలే వచ్చినట్లు తెలుస్తోంది తొలి సినిమానే అయినప్పటికీ కిరీటి డ్యాన్సులు, ఫైట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మూవీ కోసం బడ్జెట్ కూడా గట్టిగానే పెట్టారు. అయితేనే తొలిరోజు మంచి వసూళ్లే వచ్చాయి. లాంగ్ రన్‌లో కాస్త చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రావడం గ్యారంటీ అనిపిస్తోంది.
'జూనియర్' విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో సరదాగా గడుపుతూనే చదువులో మంచి ప్రతిభ చూపిస్తాడు. తను ప్రేమించిన శ్రీలీల పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ బాస్ విజయ(జెనీలియా)కు అభి అస్సలు నచ్చడు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం అనే ఊరు కూడా నచ్చదు. అలాంటిది అభితో కలిసి విజయ.. విజయనగరం వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరికి విజయకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ)