
చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీకి అనిల్ రావిపూడి దర్శకుడు. నయనతార హీరోయిన్. ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకొంటోంది. ఈ క్రమంలోనే చిరు-నయన్ కలిసున్న కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీంతో నిర్మాణ సంస్థ అప్రమత్తమైంది. ఈ మేరకు లీకు వీరులకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఓ నోట్ రిలీజ్ చేసింది.
(ఇదీ చదవండి: 'వైరల్ వయ్యారి' కొరియోగ్రాఫర్ మన మణుగూరు బిడ్డనే..)
'అనధికారికంగా షూటింగ్ రికార్డ్ చేస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం' అని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ నోట్ రిలీజ్ చేశారు. మరి ఇప్పటికైనా లీకు వీరులు ఆగుతారా? లేదా అనేది చూడాలి? ఈ సినిమాతో చిరు నటించిన మరో మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. అదే 'విశ్వంభర'. లెక్క ప్రకారం ఈ పాటికే థియేటర్లలోకి వచ్చేయాలి కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో లేట్ అవుతూ వస్తోంది. ఈ అక్టోబరులో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.
చిరు-అనిల్ రావిపూడి సినిమా మాత్రం కచ్చితంగా వచ్చే సంక్రాంతికి రానున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చారు. ఈ మూవీలో చిరు.. పీఈటీ టీచర్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. శివశంకర ప్రసాద్ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇదే సినిమాలో వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని టాక్. వీటిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీలో కోర్ట్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
