Junior Review: ‘జూనియర్‌’ మూవీ రివ్యూ | Junior Movie Review And Rating In Telugu | Kireeti Reddy | Sreeleela | Genelia | Sakshi
Sakshi News home page

Junior Movie Review: ‘జూనియర్‌’ మూవీ హిట్టా? ఫట్టా?

Jul 18 2025 9:27 AM | Updated on Jul 18 2025 3:16 PM

Junior Movie Review And Rating In Telugu

వైరల్‌ వయ్యారి..’ ఈ ఒక్క పాటతో ‘జూనియర్‌’ సినిమాకు భారీ హైప్‌ వచ్చింది. కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రమిది. 

టైటిల్‌ : జూనియర్‌
నటీనటులు: కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, డా. రవిచంద్రన్‌, రావు రమేశ్‌, సత్య, వైవా హర్ష తదితరులు
నిర్మాణ సంస్థ: వారాహి చలన చిత్రం
నిర్మాత: రజని కొర్రపాటి
రచన-దర్శకత్వం: రాధా కృష్ణ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్
ఎడిటర్‌: నిరంజన్‌ దేవరమేనే
విడుదల తేది: జులై 18, 2025

వైరల్‌ వయ్యారి..’ ఈ ఒక్క పాటతో ‘జూనియర్‌’ సినిమాకు భారీ హైప్‌ వచ్చింది. కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రమిది. సోషల్‌ మీడియాలో వైరల్‌ పాట బాగా వైరల్‌ అవ్వడం.. శ్రీలీల, జెనీలియా లాంటి స్టార్స్‌ నటిస్తుండడంతో టాలీవుడ్‌లోనూ ఈ చిత్రంపై బజ్‌ క్రియేట్‌ అయింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘జూనియర్‌’(Junior Movie Review )పై భారీ అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
విజయనగరానికి చెందిన కోదండపాణి(రవి చంద్రన్‌)-శ్యామల దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి(కిరీటీ రెడ్డి). కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది. దీంతో కోదండ పాణి తన కొడుకుకు అన్నీ తానై పెంచుతాడు. తండ్రి-కొడుకు మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎక్కువ ఉండడం.. ఆయన చూపించే అతిప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది. తండ్రికి దూరంగా ఉండాలనే పైచదువుల కోసం సిటీకి వెళ్తాడు. ‘అరవయ్యేళ్లు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమోరీస్‌ ఉండాలి కదా’ అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటాడు. 

తోటి విద్యార్థిని స్పూర్తి(శ్రీలీల)తో ప్రేమలో పడి.. ఆమె పని చేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. తొలిరోజే తన ప్రవర్తనతో బాస్‌ విజయ సౌజన్య (జెనీలియా)కు చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఓ నిజం తెలుస్తుంది. ఓ కారణంగా ఆమెతో కలిసి తన సొంతూరు విజయనగరానికి వెళ్తాడు. అభికి తెలిసిన నిజం ఏంటి? విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి? అభి తండ్రి సొంత ఊరిని వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు?  కోదండ పాణికి, విజయ సౌజన్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
సినీ తారలు లేదా ప్రముఖ కుటుంబాల నుంచి ఎవరైనా హీరోగా సీనీ రంగంలోకి అడుగుపెడితే.. తొలి సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. హీరోగా రాణించగలడా? లేదా? అనేది తొలి సినిమాతోనే డిసైడ్చెస్తారు. డెబ్యూ ఫిల్మ్తో కాస్త మెప్పించినా సరే.. భవిష్యత్కు ఢోకా ఉండదు. అందుకే వారసుల ఎంట్రీకి ప్రముఖ కుటుంబాలు చాలా జాగ్రత్తగా ప్లాన్చేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్కథతో రావడానికి ట్రై చేస్తారు. తమ వారసుడిలో ఉన్న టాలెంట్మొత్తాన్ని తొలి సినిమాలోనే చూపించేందుకు ప్రయత్నిస్తారు. కిరీటి రెడ్డి విషయంలోనూ అదే జరిగింది.(Junior Movie Review ) 

ప్రముఖులు వారసుల డెబ్యూ ఫిల్మ్‌కి కావాల్సిన అంశాలన్నింటిని కొలతలేసి మరీ ‘జూనియర్‌’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాధా కృష్ణ.  హీరోని ఎలివేట్‌ చేసేలా యాక్షన్‌ సీన్స్‌, డ్యాన్స్‌, డైలాగ్స్‌ అన్నీ చక్కగా సెట్‌ చేసుకున్నాడు.  కానీ కథ విషయంలో మాత్రం కొత్తగా ఆలోచించలేకపోయాడు.  సినిమా ప్రారంభం మొదలు ఎండ్‌ వరకు ప్రతీ సన్నివేశం పాత సినిమాలను గుర్తు తెస్తుంది. కామెడీ బాగా పండడం.. పాటలు, యాక్షన్‌ సీన్లు ఆకట్టుకునేలా ఉండడంతో రొటీన్‌ కథే అయినా ప్రేక్షకులకు బోర్‌ కొట్టదు(Junior Movie Review).  

ఒక ఎమోషన్‌ సీన్‌తో కథను ప్రారంభించి.. కాసేపటికే కథను కాలేజీకి షిఫ్ట్‌ చేశాడు. హీరో ఎంట్రీ సీన్‌ని బాగా ప్లాన్‌ చేశారు. కాలేజీలో హీరోయిన్‌తో చేసే అల్లరి, స్నేహితులతో కలిసి చేసే కామెడీ బాగా వర్కౌట్‌ అయింది.  జెనీలియా పాత్ర ఎంట్రీ తర్వాత కథనం కాస్త సీరియస్‌గా సాగుతుంది.  ఇంటర్వెల్‌ సీన్‌ ద్వితీయార్థంపై ఆసక్తి పెంచేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కొన్ని సన్నివేశాలు శ్రీమంతుడు, మహర్షి సినిమాలను గుర్తు తెస్తుంది. కొన్ని చోట్ల ఎమోషన్‌ బాగా పండింది కానీ కథనంలో మాత్రం కొత్తదనం అనిపించదు. ప్రతి సీన్‌ ఎక్కడో చూసినట్లుగానే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఓ చిన్న ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హీరో కిరీటిరెడ్డికి మాత్రం ఫర్ఫెక్ట్ డెబ్యూ ఫిల్మ్. మరి కమర్షియల్‌గా ఏ మేరకు ఆట్టుకుంటుందో చూడాలి. 

ఎవరెలా చేశారంటే..
కిరీటీకి ఇది తొలి చిత్రమే అయినా తెరపై చూస్తే మాత్రం ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. యాక్షన్‌ సీన్లతో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. ఇక డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వైరల్‌ వయ్యారి పాటలో శ్రీలీలతో పోటీ పడి మరీ డ్యాన్స్‌ చేశాడు. కొన్ని స్టెప్పులు జూనియర్‌ ఎన్టీఆర్‌ స్థాయిలో వేశాడు. శ్రీలీల పాత్రకు ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదు. కేవలం పాటల కోసమే అన్నట్లుగా ఆమె పాత్రని తీర్చిదిద్దారు. 

సెకండాఫ్‌ మొత్తంలో ఒక వయ్యారి పాటలో మాత్రమే కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత జెనీలియా ఓ మంచి పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. విజయ సౌజన్య పాత్రకు ఆమెకు న్యాయం చేసింది. అయితే నటించేందుకు ఆ పాత్రకు పెద్దగా స్కోప్‌ లేదు. హీరో తండ్రిగా రవిచంద్రన్‌ ఉన్నంతలో చక్కగా నటించాడు . వైవా హర్ష, సత్యల కామెడీ బాగా పండింది. రావు రమేశ్‌, అచ్యుత్‌ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ సినిమాకి బిగ్ ఎసెట్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. వైరల్‌ వయ్యారి పాట బిగ్‌ స్క్రీన్‌పై ఇంకా బాగుంది. సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement