
ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటించిన తొలి చిత్రం జూనియర్ (Junior Movie). ఇది మొదటి సినిమా అయినప్పటికీ కిరీటి నటనకు, ముఖ్యంగా అతడి డ్యాన్స్‌కు ఫుల్ మార్కులు పడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిని అని చెప్పుకునే ఇతడు ఆ హీరోకు తగ్గట్లుగానే డ్యాన్స్ చేశాడు. వైరల్ వయ్యారి సాంగ్‌లో ఎన్టీఆర్‌ను గుర్తుచేసేలా స్టెప్పులతో అదరగొట్టాడు.
వైరల్ వయ్యారి ఫుల్ వీడియో సాంగ్
శ్రీలీల (Sreeleela) గ్రేస్, ఎక్స్‌ప్రెషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎప్పటిలాగే చించిపడేసింది. ఒకరకంగా చెప్పాలంటే జూనియర్ సినిమాకు వైరల్ వయ్యారి పాట భారీ హైప్ తీసుకొచ్చింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. 4కె వర్షన్‌లో వైరల్ వయ్యారి సాంగ్ (Viral Vayyari Full Video Song)ను యూట్యూబ్‌లో అందుబాటులోకి తెచ్చారు.
పోటాపోటీగా డ్యాన్స్ చేసిన కిరీటి, శ్రీలీల
ఇది చూసిన అభిమానులు.. శ్రీలీలకే పోటీ ఇచ్చేలా డ్యాన్స్ చేశాడని కిరీటిని ప్రశంసిస్తున్నారు. ఇక ఈ పాటకు రేవంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. జూనియర్ సినిమా విషయానికి వస్తే.. కిరీటి, శ్రీలీల జంటగా నటించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.