
నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నటి రహస్య దంపతులకు కొద్దిరోజుల క్రితం కుమారుడు జన్మించారు. అయితే, తాజాగా బాబుతో పాటుగా వారందరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలిసారి తన కుమారుడితో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆపై తిరుమలలోనే తమ కుమారుడికి నామకరణం చేశామని ఆయన అన్నారు. బాబుకి 'హను అబ్బవరం' అని పేరు పెట్టామని రివీల్ చేశారు.
శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపిన కిరణ్.. తన సినిమాల గురించి కూడా పంచుకున్నారు. కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలు చిత్రీకరణ సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల మరో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ప్రకటించారు. అయితే, కుమారుడికి 'హను' అని పేరు పెట్టడం చాలా బాగుందని అభిమానులు చెబుతున్నారు. బాబుకి ఎల్లప్పుడు 'హనుమాన్' ఆశీస్సులు ఉంటాయని ఆశీర్వదిస్తున్నారు. నటి రహస్యను ప్రేమించి కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకున్నారు. ‘రాజావారు రాణిగారు’లో వారిద్దరూ కలిసి నటించారు. అక్కడ మొదలైన స్నేహం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
