
ప్రముఖ దర్శకుడు సుకుమార్ - తబిత దంపతుల కుమార్తె సుకృతి వేణి జాతీయ స్థాయిలో సత్తా చాటింది.

'గాంధీ తాత చెట్టు' సినిమాతో ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డ్‌కు సుకృతి ఎంపికైంది.

నాన్న (సుకుమార్) తెరకెక్కించిన 'పుష్ప' అల్లు అర్జున్‌కు అవార్డ్ అందిస్తే.. ఇప్పుడు సుకృతి కూడా అదే బాటలో అడుగులేసింది

టీనేజీలో ఏ అమ్మాయి గుండు చేయించుకోవడానికి ఇష్టపడదు. కానీ ‘గాంధీ తాత చెట్టు’ సినిమా కోసం సుకృతి గుండు చేయించుకుని ఆశ్చర్యపరిచింది.

ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డ్స్‌ను కూడా ఈ చిత్రం అందుకుంది

దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ పరిచయ బాలనటిగా అవార్డ్ సాధించింది

'గాంధీ తాత చెట్టు' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి.

సుకృతి ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది














