
స్నేహితుల దినోత్సవం..పైగా ఆదివా రం.ఇంకేముంది అందాల సాగ రతీరం..స్నేహితుల తీరంగా మారి పోయింది.శుభాకాంక్షల వెల్లువలు..కేక్ కటింగ్లు.. ఆటపాటలు.. సముద్ర స్నానాలు..సెల్ఫీలు.. వాట్సాప్ షేరింగ్లు..ఫేస్బుక్లో అప్లోడ్స్.. ఒకటే ముచ్చట్లతో రోజంతా ఆనందోత్సాహలతో గడిపారు. అలల వయ్యారాలు.. యువత కేరింత లతో సాగరతీరంలో సందడి నెలకొంది.

బీచ్ రోడ్డులోని కొన్ని హోటళ్లలో కార్నీవాల్ తరహాలో 'దోస్తీవాల్' వేడుకలు జరగ్గా.. ఇంకొన్ని హోటళ్లలో పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు సంబరంగా జరుపుకున్నారు.









