breaking news
friendship day wishes
-
నిజమైన ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు
ప్రపంచం ఎంత వేగంగా పరిగెత్తుతున్నా... మానవ సంబంధాల్లో స్నేహానికి ఉన్న స్థానం ఎప్పటికీ ప్రత్యేకం... స్నేహానికి విలువ ఇచ్చే రాశీ ఖన్నా అంటున్న మాటలివి. ఇంకా ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తన జీవితంలోని అత్యంత ఆత్మీయమైన మిత్రులు, స్నేహం విలువ గురించి మనసు విప్పి మాట్లాడారామె. రాశీ ఖన్నా చెప్పిన కొన్ని ముచ్చట్లు ఆమె మాటల్లోనే...స్నేహం... ఓ నటన లేని వేదికమనం సంతోషంగా ఉన్నట్లు నటించాల్సిన అవసరం లేని ఒకే ఒక్క ప్లాట్‌ఫామ్ ‘స్నేహం’. ఎటువంటి ఈర్ష్య, అసూయ, పోటీ లేకుండా, ఎలాంటి తీర్పులు, విమర్శలు లేకుండా... మన గెలుపును వారి గెలుపుగా భావిస్తూ, అలాగే మన కష్టకాలంలో వెన్నంటి నిలిచేవారే నిజమైన స్నేహితులు. అలాంటి నిజమైన స్నేహం ఎంతో విలువైనది.ఒక్కరున్నా చాలుమన జీవితంలో ఎంతమంది మిత్రులున్నారనేది ముఖ్యం కాదు. కష్టాల్లో అండగా నిలిచే ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలు. జీవితం గందరగోళంగా మారినపుడు, బయటపడే మార్గం కనిపించనపుడు మన బలాన్ని, వ్యక్తిత్వాన్ని గుర్తు చేసి సరైన మార్గదర్శకత్వం చేసే తోడు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. నా లైఫ్‌లో అలాంటి మంచి మిత్రులు ఉన్నందుకు నేను వారికి కృతజ్ఞతతో ఉంటాను.ప్రతి క్షణం నా వెంటే!వాణి, సావంత్... ఇద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్. వారు నా లైఫ్‌లో ఉండటం నా అదృష్టం. ఇద్దరి వ్యక్తిత్వాలు వేరయినప్పటికీ... నా లైఫ్‌కి దిక్సూచిలా నిలిచారు. గత రెండు దశాబ్దాలుగా నాకు తోడుంటూ ఈరోజు నేనీ స్థాయిలో ఉండటంలో కీలక పాత్ర పోషించారు. నాకు ఏదైనా హెల్ప్ కావలసి వస్తే వాణి, సావంత్‌లకు అర్ధరాత్రి కూడా ధైర్యంగా ఫోన్ చేయగలను. ఎందుకంటే వారు నా ఆనందంలో మాత్రమే కాదు... నా కష్టాల్లోనూ నా వెంటే ఉంటారన్న నమ్మకం, ధైర్యం నాకున్నాయి. నా విషయంలోనూ వారు అంతే భరోసాగా ఉంటారు.ఆడంబరాలకు దూరంపెద్ద పెద్ద పార్టీలు చేసుకోవడం వంటి ఆడంబరాలకు మేం దూరంగా ఉంటాం. రుచికరమైన భోజనం చేయడం, వీలైనంత ఎక్కువ సమయం కబుర్లు చెప్పుకోవడం, ఒకరి క్షేమ సమాచారాలను మరొకరం తెలుసుకోవడం వంటి నిరాడంబరమైన విషయాలకే ప్రాధాన్యత ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ఖరీదైన గిఫ్ట్‌లు, పార్టీల కంటే ఒకరికొకరు తోడుగా నిలబడటమే అత్యంత ముఖ్యం.... మేం అదే ఫాలో అవుతాం.వినేవారు కావాలి...మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక తోడు కావాలనుకుంటాం. మన బాధలను వారు ఓపికగా వినాలనుకుంటాం. అలాంటి స్నేహితులు ఉంటే... మనకు వాళ్లే మంచి ‘పిల్లర్’. మన ఆవేదనను అర్థం చేసుకుంటారు. పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అలాంటి క్షణాలు తప్పకుండా ఉంటాయి.ముద్దు పేర్లతో...నాకు అత్యంత సన్నిహితులు, స్నేహితులు నన్ను కొన్ని ప్రత్యేకమైన ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే వాటిలో కొన్ని పేర్లు బయటకు చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. సో... నేను చెప్పను (నవ్వేస్తూ).అండగా నిలుస్తాం...ఫ్రెండ్షిప్లో లెక్కలు చూసుకోవడం, హెచ్చు తగ్గులు చూపించుకోవడం ఉండదు. జీవితంలో వచ్చే కష్టసుఖాల్లో, గెలుపు, ఓటములలో మేమందరం ఒకరికొకరం అండగా నిలిచాం. వారికి అవసరమైన సమయాల్లో నేను తోడుగా ఉన్నాను, నా కష్టాల్లోనూ వారు అలాగే అండగా నిలిచారు. నేను వారిని, వారు నన్ను నమ్మగలమనే కొండంత విశ్వాసం మా మధ్య ఉంది. కొన్నిసార్లు వారు చేసిన ఒక్క ఫోన్ కాల్ నా ఆత్మస్థైర్యాన్ని పెంచి, నా మానసిక స్థితిని పూర్తిగా మార్చివేసిన రోజులు ఉన్నాయి. అదే అసలైన, నిజమైన స్నేహం.ఏది సరైనదో అదే చె΄్తారునిజమైన స్నేహితులు కేవలం మనకు నచ్చే మాటలే కాదు... మనకు ఏది అవసరమో, మన జీవితానికి ఏది సరైనదో అదే నిర్మొహమాటంగా చె΄్తారు. నా స్నేహితులు వాణి, సావంత్ ఇద్దరూ నా పట్ల ఎంతో నిజాయితీగా ఉంటారు. వారి ప్రేమ, ఆప్యాయత నుంచే ఆ నిజాయితీ వస్తుంది కాబట్టి నేను వారికి ఎంతో విలువిస్తాను.మాకూ ఒక వాట్సాప్ గ్రూప్మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో సంభాషణలు సరదాగా సాగుతుంటాయి. మీమ్స్ షేర్ చేసు కుంటాం.. వాయిస్ మెసేజ్‌లు పంపుకుంటాం. ఎప్పటికీ చేయలేని, నెరవేరని ప్లాన్లు వేస్తుంటాం. అలాగే ఒకరి నొకరం ఆటపట్టించుకుంటూ సరదాగా గడుపుతుంటాం.స్నేహానికి కొలతల్లేవుస్నేహానికి కొలతలుండవు... ఎన్నిసార్లు కలుస్తున్నారు? సోషల్ మీడియాలో ఎన్ని ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు వంటి అంశాలతో స్నేహాన్ని అంచనా వేయకూడదు. కష్ట సమయాల్లో మీ పక్కన ఎవరు నిలబడ్డారనేదాన్ని బట్టే స్నేహానికి ఉన్న అసలైన విలువను కొలవాలి. లైఫ్‌లో నిజమైన ఫ్రెండ్ దొరకడం అనేది నా దృష్టిలో చాలా లక్. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకునే వారిని, మీకు ప్రశాంతతను ఇచ్చే వ్యక్తులను వదులుకోవద్దు. అందరికీ హ్యాపీ ఫ్రెండిషిప్ డే. – డి.జి. భవాని -
నా స్వేచ్ఛావనం నా స్నేహితురాలు
స్కూల్ బెంచ్ నుండి బోర్డ్ మీటింగ్ వరకు... మొదటి పీరియడ్స్ భయం నుండి మొదటి డెలివరీ ఆందోళన వరకు... ఒకే ఒక్క తోడు... స్నేహితురాలు!స్త్రీ జీవితంలో ఎన్నో పాత్రలు. కూతురు, భార్య, కోడలు, అమ్మ...ప్రతి పాత్ర పక్కన తప్పదు ఆమె తోడు.ఒత్తిడి చుట్టుముట్టినప్పుడు, కన్నీళ్లు ఆనకట్ట తెంచుకున్నప్పుడు, గట్టిగా నవ్వాలనిపించినప్పుడు... ప్రతి స్త్రీ వెతుక్కునేది ఆమె పేరు. ప్రాణస్నేహితురాలే ప్రతి స్నేహితురాలి సగం ఆకాశం.ఆ రోజు బాక్స్ కట్టుకెళ్లలేదు. లంచ్ బెల్ కొట్టాక నోట్స్ రాసుకున్నట్టు యాక్షన్ చేస్తుంటే వచ్చి కూచుంది. టిఫిన్ బాక్స్ తెరిచి ‘నా దగ్గర అన్నం ఉంది, నీకు సగం ఇస్తా’ అని ముద్ద కలిపి పెట్టింది. అది అన్నం అనుకోలేదు. స్నేహం అనుకున్నాను. లెక్కల టీచరు మాటిమాటికి తిడుతూ ఉంటే బెంచ్ కింద నుండి చేతిని గట్టిగా పట్టుకుని ‘భయపడకు’ అని కళ్లతోనే ధైర్యం చెప్పేది. ఆ రోజుల్లో స్నేహమంటే ఏముంది? పెన్ను అడగడం... రబ్బరు సగానికి కోసి పంచుకోవడం.... పరీక్షలో తెలియని ప్రశ్నకు ‘ఇది రాయి’ అని అందించుకోవడం.... అంతేగా. అన్నీ తను చేసేది. ‘నువ్వు నా ఫ్రెండువి. నాకు మాత్రమే ఫ్రెండువి’ అన్నట్టుండేది. కలిసి వెళ్లిన సినిమా, కుట్టించుకున్న పూలజడ, ఆడిన ఆటలు... తిరిగి రావు. కాని స్నేహితురాలి మాటలో, రూపంలో, తోడులో అవన్నీ సజీవంగా ఉంటాయి. ఉండిపోతాయి. ఆస్తులు, మెడలో ధగధగలు అందరి దగ్గరా ఉండొచ్చు. కాని నిజమైన స్నేహితురాలు ఉన్నవాళ్లే పది కోకాపేటల ఓనర్లు.హాస్టల్లో పెద్దదిక్కుఊరుగాని ఊరు. అమ్మతోడు లేని చోటు. ఊరికూరికే ఏడుపొస్తుంటే పక్కబెడ్ నుండి లేచి తల నిమిరింది. ‘ఏంటే... అంత హోమ్ సిక్ ఎందుకు? మేమంతా లేమా’ అని గద్దించి, బెంగపోవడానికి తెల్లవార్లు శ్రీదేవి, మాధురి దీక్షిత్ కబుర్లు చెప్పింది. ఒకప్పుడు హాస్టల్లో ఉంటే బెంగ. ఫ్రెండ్ దొరికాక ఇంట్లో ఉంటే బెంగ. మొదటి ప్రేమ, మొదటి చూపు... ఆ అలజడులన్నీ పంచుకునే ఏకైక డైరీ– ఫ్రెండు. బ్రేకప్ అయిన రాత్రి నలిగిపోయిన మనసుతో ఏడుస్తుంటే, ఏమీ అడగకుండా గట్టిగా పొదువుకొని ఒళ్లో తలపెట్టుకోమనే ఓ అమృతస్పర్శ.పక్క డెస్క్‌లో సోల్ సిస్టర్ఉద్యోగంలో అంతా బెరుకే. బాస్ తిట్టినప్పుడు, సీనియర్ ఏడిపించినప్పుడు, ప్రమోషన్ రానప్పుడు... పక్క డెస్క్ నుంచి వినిపించే మాట– ‘నువ్వు డిజర్వ్ చేస్తావే’... కలీగ్లా ఎప్పుడూ లేదు. ప్రాణస్నేహితురాలిగానే. పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక ఆఫీస్, ఇల్లు బ్యాలెన్స్ చేయలేక ఏడుస్తుంటే ‘ఈ రోజు నీ పని నేను చూసుకుంటా, నువ్వు రెస్ట్ తీసుకో’ అని చెప్పే సోల్ సిస్టర్. తను రెండు కప్పుల వేడి కాఫీతో వచ్చి పక్కన కూర్చుందంటే ఆ రిలాక్సేషన్ ఏ థెరపిస్ట్ కూడా ఇవ్వలేదు. ‘పోతే పోయింది ఉద్యోగం.. మనశ్శాంతి ముఖ్యం’ అని ఆమె చెప్పే ఒక్క మాట చాలు, మళ్లీ కీబోర్డ్‌పై వేళ్లు పరుగెత్తడానికి! జీవితం ఎన్ని బాధ్యతలు మోపినా వెన్ను కాసే సైనికురాలు. బలహీనతలను బలంగా మార్చే మంత్రగత్తె.తన వల్లే కదా జగతి ప్రాణ స్నేహితురాలు లేకపోతే రోజులు ఇలా గడిచేవా? రాత్రి రెండు గంటలకు ‘నిద్రపట్టడం లేదే’ అని వాయిస్ నోట్ పంపితే టక్కున కాల్ చేస్తుందే! ఫిజికల్‌గా దూరంగా ఉన్నా, మానసికంగా అతి దగ్గర. వలపోసుకుంటుంటే ఏ తీర్పు చెప్పకుండా కేవలం వినే ఒక చెవి . ‘ఏడవు, నేనున్నా’ అని చెప్పే గుండె. స్నేహం అంటే రోజూ కలవడం కాదు. ఏడాదికి ఒకసారి కలిసినా, కలిసిన వెంటనే ‘నువ్వు ఏం మారలేదే’ అనిపించడం. మగవారి స్నేహంలోని లాజిక్‌లు ఆడవారి స్నేహంలో ఉండవు. ఇక్కడ కేవలం ఎమోషన్స్ ఉంటాయి. ఒక మహిళ శారీరక, మానసిక వేదనను ఇంకొక మహిళ మాత్రమే అర్థం చేసుకోగలదు. సమాజం స్త్రీకి ఎన్నో చట్రాలు బిగిస్తుంది. ఆ చట్రాలన్నింటినీ విప్పి, హాయిగా ఊపిరి పీల్చుకునే ఏకైక స్వేచ్ఛావనం... స్నేహితురాలు! ఆమె ముందు ఎలాంటి మేకప్‌లు అక్కర్లేదు, అబద్ధాలు అవసరం లేదు. ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని ఏళ్లు మాట్లాడకపోయినా... అవసరమైనప్పుడు ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో పాత స్నేహం మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. అందుకే ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మీ ఫోన్ తీసి, మీ జీవితపు ‘సేఫ్ జోన్’ అయిన మీ స్నేహితురాలికి చిన్న వాయిస్ నోట్ పంపండి. ‘నువ్వు నా లైఫ్‌లో ఉన్నందుకు థాంక్స్... హ్యాపీ ఫ్రెండ్షిప్ డే!’ అని చెప్పేయండి. లోకమంతా ఒకవైపు, మీ ఇద్దరి స్నేహం ఒకవైపు అని ఆమెకు గుర్తు చేయండి. మీ ఒక్క మెసేజ్ ఆమె ముఖంలో ఎంతటి అమూల్యమైన చిరునవ్వును పూయిస్తుందో చూడండి! చాలామంది మీ జీవితంలోకి వచ్చి వెళ్తుంటారు.కానీ స్నేహితులు మాత్రమే మీ హృదయంలో చెరగని ముద్ర వేస్తారు.– ఎలియనర్ రూజ్వెల్ట్, అమెరికన్ యాక్టివిస్ట్స్నేహితుడి పని ఏమిటంటే ప్రత్యేకంగా ఒక పని అంటూ ఏదీ లేకపోవడమే!– డెట్లెఫ్ కార్టెస్, మ్యూజికల్ ఆర్టిస్ట్ప్రపంచమంతామిమ్మల్ని వదిలి వెళుతున్నప్పుడుమీతో కలిసి నడిచేవాడే నిజమైన స్నేహితుడు.– వాల్టర్ విన్చెల్, ప్రముఖ జర్నలిస్ట్ప్రియ మిత్రమా...నీ గురించి ఆలోచిస్తున్నప్పుడుబాధలు మాయమవుతాయి.దుఃఖాలన్ని తొలగిపోతాయి.– విలియం షేక్సి ్పయర్– కె -
అరే.. అలా కూడా ఫ్రెండ్షిప్ చేస్తారా?!
ఆగస్టు 2 ఫ్రెండ్షిప్ డే. మనం ఫ్రెండ్షిప్ డే వస్తే ఏం చేస్తాం? ఒక బ్యాండ్ కడతాం లేదా చాక్లెట్ ఇస్తాం. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఫ్రెండ్స్‌ను గౌరవించడానికి, కొత్త దోస్తులను చేసుకోవడానికి చాలా విచిత్రమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో చూసేద్దామా!కొరియా: ‘కంగారూ’ కౌగిలింతలు! (Kangaroo Hugs)దక్షిణ కొరియాలో పిల్లలు ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి వింత పద్ధతి ఉంది. ఒకరి వెనుక ఒకరు నిలబడి వెనుక ఉన్న దోస్త్ ముందున్న దోస్త్‌ని కంగారూ తన బిడ్డను పొట్టలో దాచుకున్నట్లు గట్టిగా కౌగిలించుకోవాలి. దీనిని ‘బ్యాక్ హగ్ దోస్తీ’ అంటారు. ఇలా చేస్తే వాళ్ల స్నేహం వందేళ్లు ఉంటుందట!జర్మనీ: ‘లెటర్ బాక్స్’ స్నేహం! సీక్రెట్ లెటర్ బాక్స్)జర్మనీలో స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ వెనుక ఒక ఖాళీ డబ్బాను ‘ఫ్రెండ్షిప్ బాక్స్’గా పెడతారు. ఫ్రెండ్ ఎవరైనా బాగా నచ్చితే ముఖం మీద చెప్పకుండా ఒక చిన్న కాగితం మీద పేరు రాసి ఆ బాక్సులో వేస్తారు. శనివారం రోజు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఎవరికి ఎక్కువ లెటర్స్ వస్తే వారే ఆ వారం క్లాస్ ‘సూపర్ ఫ్రెండ్‘!అర్జెంటీనా: స్కూల్ బంక్!అర్జెంటీనాలో జూలై 20న ఫ్రెండ్షిప్ డే వస్తే పిల్లలెవ్వరూ స్కూల్‌కి, పెద్దవాళ్లు ఆఫీసులకి వెళ్లరు. ప్రభుత్వం దీనిని అధికారిక సెలవుగా ప్రకటించకపోయినా అందరూ కలిసి ఒకేరోజు బంక్ కొట్టి, రోజంతా పార్కుల్లో ఆటలు ఆడుతూ గడుపుతారు.డెన్మార్క్: ‘కలర్ కోడ్’ దోస్తీ!’డెన్మార్క్ దేశంలో పిల్లలు వేసుకునే బట్టల రంగులను బట్టి వాళ్ల ఫ్రెండ్షిప్ స్టేటస్ తెలిసిపోతుంది. ఒకవేళ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకేరోజు ఒకేరంగు డ్రెస్ వేసుకుని స్కూల్‌కి వస్తే, వాళ్లు ‘ట్విన్ ఫ్రెండ్స్’ అని అర్థం. ఆ రోజు క్లాస్ టీచర్ వాళ్లను విడదీయకుండా ఒకే బెంచ్‌లో కూర్చోబెడతారు. -
విశాఖ : అందాల సాగ రతీరం..స్నేహితుల తీరంగా (ఫొటోలు)
-
స్వచ్ఛమైన స్నేహం.. తీపి జ్ఞాపకాల సంతకం..(ఫొటోలు)
-
Friendship Day: చెరగనిది మా స్నేహబంధం (ఫొటోలు)
-
ఇందులో మీ ఫ్రెండ్ ఏ కేటగిరీనో చెక్ చేసుకోండి
Happy Friendship Day 2021: అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన స్నేహ ప్రవాహం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫేస్బుక్, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్సుల్లో ఫ్రెండ్షిప్ గొప్పదనం గురించి కొటేషన్లు, దోస్త్‌ల ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. రెగ్యులర్‌గా ఫ్రెండ్షిప్ విలువ చెప్పే కంటెంట్‌కు ఇవాళ ఫుల్ గిరాకీ ఉంటుంది. అది చూసి కొందరికి ‘వావ్’ అనిపించొచ్చు.. మరికొందరికి ‘అబ్బో’ అనిపించొచ్చు. కానీ, ఎవరెన్ని అనుకున్నా స్నేహం అంటే.. . . . . . . . . . . ఒక కచ్చితమైన అవసరం. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ది బెస్ట్’, ‘స్నేహాన్ని మించిది లేదు’.. ఇలాంటి కొటేషన్స్ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. సింగిల్ కింగ్‌లైనా ఉంటారేమోగానీ.. ఫ్రెండ్ లేని మనిషి అరుదనే చెప్పాలి. జీవితంలో ఎవరితో షేర్ చేసుకోవద్దని ఫిక్స్ అయ్యే విషయాల్ని కూడా.. చివరికి ఏదో ఒక ‘బలహీన’ సందర్భంలో చెప్పుకునేది స్నేహితుడికే!. అలాగని మిగతా బంధాలను తక్కువేం చేయదు స్నేహ బంధం. అయితే స్నేహాల్లోనూ రకరకాలుంటాయి. అలాగే స్నేహితుల్లో రకరకాల మనస్తత్వాలవాళ్లూ ఉంటారు. అందుకే ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దోస్తీలోని ఆ జానర్ల గురించి సరదాగా చర్చించుకుందాం. పక్కా కమర్షియల్ స్నేహంలో అవసరం ఉండొచ్చు. కానీ, స్నేహాన్ని పూర్తి అవసరంగా మార్చుకునేటోళ్లూ ఉంటారు. మనిషిని అమితంగా ఆకర్షించే నెగెటివిటీ వల్ల చాలామందికి స్నేహం మీద కలిగే భావనే ఇది. అఫ్కోర్స్.. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఈ లోకంలో అన్నింటి కన్నా మిన్న అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. చివరికి డబ్బు-అంతస్థుల దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు తడబడుతుంది స్నేహం. టార్చర్ స్నేహం వీళ్లు ప్రాణ స్నేహితులంటూ చెప్తుంటారు. ఊరంతా ప్రచారం చేస్తారు. వీళ్ల మాటలు కోటలు దాటుతాయి. కానీ, పక్కలోనే ఉంటూ పోటు పోడుస్తుంటారు. నస పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అయితే వీళ్ల స్నేహంలో ఒక స్వచ్ఛత ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది. అవసరాల్లోనే కాదు.. ఆపదలోనూ వదలుకోలేని బలహీనత కనిపిస్తుంటుంది వీళ్ల స్నేహంలో. అందుకే ‘ఫ్రెండ్‌వి రా’ అనుకుంటూ కలకాలం కలిసి మెలిసి ఉంటారు. ఏజ్‌లెస్ దోస్తులు ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. కానీ, స్నేహానికి వయసుతో సంబంధం ఉండదని మరో నిజం. ఇది నిరూపించే దోస్తులు మన చుట్టూరానే.. మనలోనే కనిపిస్తుంటారు. కలిసి సరదాలు చేస్తారు. గోలలు చేస్తుంటారు. కలిసే గోతిలో పడుతుంటారు. వాళ్ల స్నేహం వాళ్లకే కాదు.. అవతలి వాళ్లకూ ఎంటర్టైన్మెంట్ పంచుతుంటుంది. అవసరానికో స్నేహం ప్రతీ ఫ్రెండూ అవసరమేరా అనే కొటేషన్ తెలుసు కదా!. అలాగే ఈ రకం స్నేహంలో అవసరం తీరేంత వరకే స్నేహం కొనసాగుతుంది. ఆ అవసరంలో ఉన్నంత దాకా వీళ్లు వెంట నడుస్తారు. అవసరమైతే సాయం చేస్తారు. తీరా.. తమ అవసరం పూర్తిగా తీరాక హ్యాండిచేస్తారు. అపార్థాలు, అవమానాలు, అనుమానాల నడుమ ఇలాంటి స్నేహాలు కలకాలం కొనసాగడం కొంచెం కష్టమే!. ప్రాణ స్నేహితులు ఈ స్నేహం చాలా చాలా ప్రత్యేకం. చిన్న వయసు నుంచి మొదలై చివరిదాకా సాగే అవకాశాలే ఎక్కువ. ఈ స్నేహంలో రాగద్వేషాలు కనిపించేది అతితక్కువ. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునేంత స్థాయి వీళ్లలో ఉంటుంది. ప్రాణం పోయేంత వరకు స్నేహాన్ని విడిచిపెట్టవు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢబంధం వీళ్లది. పైగా ఎలాంటి తారతమ్యాలు లేనిది ఈ స్నేహం. అందుకే ‘చిలకా-కోయిల’లా కలకలకాలం కలిసి మెలిసి ఉంటారు. ఇలాంటి స్నేహంలో నడివయసులో పుట్టి కడదాకా సాగే స్నేహ బంధాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. లవ్లీ ఫ్రెండ్స్ అవతలి వాళ్లకు ఇదొక చిల్లర-చిచ్చర స్నేహం అనిపించొచ్చు. కానీ, వాళ్ల స్నేహంలో ఒక ఫ్రెష్‌నెస్ ఉంటుంది. వాళ్ల ఆనందం వాళ్లదే. అవతలి వాళ్ల గురించి అస్సలు పట్టించుకోరు. పోటాపోటీగా ఒకే అమ్మాయికి బీట్ కూడా కొడతారు. బడి నుంచి గుడి దాకా, రూమ్ నుంచి ఇంటి దాకా ప్రతీ విషయం చర్చించుకుంటారు. అవసరాలకు సాయం ఒకరికొకరు చేసుకుంటారు. కెరీర్ ఎదుగుదలకు వీళ్ల ప్రోద్భలం ఉంటుంది. అందుకే ఇది కూడా ఒక ప్రత్యేకమైన స్నేహమే!. ఇంటి స్నేహం స్కూల్, కాలేజీలు, ఆఫీసులు.. ఫ్రెండ్స్ అంటే ఇక్కడే దొరుకుతారా?. మనసు పెడితే ఇంట్లోనూ ఇంతకన్నా బలమైన స్నేహమే దొరుకుతుంది. అమ్మానాన్న, అక్కాచెల్లి, అన్నాతమ్ముడు, బావాబామ్మర్ది, మామాఅల్లుడు, తాతామనవడు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బంధాలు స్నేహ బంధాలుగానూ మార్చుకోవచ్చు. సంతోషమొచ్చినా.. దుఖమొచ్చినా వాళ్లతో పంచుకుని మనసు కుదుటపర్చుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లో అపార్థాలకు చోటు ఉండని ఏకైక స్నేహం.. ఇంటి స్నేహమే! వాట్సాప్ బ్యాచ్ చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంటారు. సంవత్సరాల దొర్లిపోయే దాకా గుర్తుండరు. సడన్‌గా గుర్తుకొస్తారు. ఏదో ఒక సందర్భంలో కలుస్తారు. అడ్డగోలు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తారు. అయితే మెసేజ్‌ల వరద.. లేదంటే గప్‌చుప్. ఇలాంటి స్నేహితులు గెట్ టు గెదర్‌లోనే కలిసేది. చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా. ‘గుర్తుకొస్తున్నాయి..’ అంటూ రీయూనియన్లలో సందడి చేసే బాపతి అన్నమాట. అఫ్కోర్స్.. బిజీ, టైం లేదంటూ కలయికను ఎగ్గొట్టి స్నేహితుల రోజున ఉప్పెనలా మెసేజ్‌లు పెట్టే దోస్తులు చాలామందే ఉన్నారండోయ్. ఇవేకాదు.. ఇంకా చాలా రకాల స్నేహాలే ఉంటాయి. అయితే నవ్వినా, తిట్టినా, ఏడ్పించినా, జోకులేసుకున్నా, చివరికి మోసానైనా తట్టుకుని నిలబడేది ఒక్క స్నేహమే. ఎంత చెప్పుకున్నా దూరాలను దగ్గర చేసే స్నేహం అంతిమంగా గొప్పదే. అందుకే ఆ బంధాన్ని గౌరవిస్తూ ఈ రోజును గుర్తించడం, అనుభవాలేవైనా అప్పటిదాకా జీవితంలో తారసపడిన రకరకాల స్నేహాల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం తప్పేం కాదు. చివరగా.. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. -సాక్షి, వెబ్‌డెస్క్ -
దోస్త్ మేరా దోస్త్
ఆదివారం స్నేహితుల దినోత్సవం. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య ఉన్న స్నేహాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘ఫ్రెండ్షిప్లో నెమ్మదిగా వెళ్లాలి. కానీ ఒక్కసారి ఫ్రెండ్ అయిన తర్వాత ఆ బాండ్ ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి. మా మధ్య ఫ్రెండ్షిప్ని వివరించడానికి ఈ కొటేషన్ చాలు’’ అన్నారు తారక్. ‘‘కొన్ని బంధాలు ఏర్పడటానికి సమయం తీసుకుంటాయి. ఏర్పడ్డాక తిరిగి చూసేపనిలేదు. తారక్‌తో నాకు అలాంటి బాండ్ ఏర్పడింది’’ అన్నారు చరణ్. వీళ్లిద్దరూ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే పీరియాడికల్ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
విడిపోని స్నేహం మనది
న్యూఢిల్లీ: స్నేహితుల దినోత్సవం సందర్భంగా భారత్‌కు ఇజ్రాయెల్ వినూత్నంగా సందేశం పంపింది. బ్లాక్‌బస్టర్ హిందీ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్ నహీ తోడేంగే.. పాటను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘భారత్‌కు ఫ్రెండ్‌షిప్‌డే శుభాకాంక్షలు! మన స్నేహం మరింత బలపడాలి, భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’ అంటూ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది. దీంతోపాటు ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుల సమావేశాల దృశ్యాలను, 1975 నాటి హిందీ హిట్ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్ నహీ తోడేంగే(మన స్నేహాన్ని వదులుకోం)పాటను నేపథ్యంగా జత చేసింది. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య స్నేహ భావం కలకాలం నిలిచి ఉంటుందంటూ హీబ్రూ భాషలో ట్వీట్ చేశారు. ‘కృతజ్ఞతలు. అద్భుతమైన ఇజ్రాయెల్ ప్రజలకు, మంచి స్నేహితుడు నెతన్యాహుకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. రెండు దేశాల మైత్రి బలమైంది, శాశ్వతమైంది. ఈ స్నేహం మరింత వర్థిల్లాలి’ అని పేర్కొన్నారు. -
స్నేహితుల దినోత్సవ సైకత శుభాకాంక్షలు
గార శ్రీకాకుళం : మండల పరిధిలోని పోర్టు కళింగపట్నం బీచ్‌లో ఆదివారం స్నేహితుల దినోత్సవం పురస్కరించుకోని సైకత శిల్పం ద్వారా శుభాకాంక్షలు తెలపడంతో అందరూ అభినందించారు. అంపోలు గ్రామానికి చెందిన దాకోజు లాలూప్రసాద్ స్నేహితులకు దోస్త్ అన్న పేరిట సైకత శిల్పాన్ని రూపొందించాడు. సాయంత్రం బీచ్‌కు వచ్చిన సందర్శకులు దీన్ని చూసి అభినందించారు. -
సంతోషంగా ఉన్నా
సమస్య వచ్చినప్పుడు బాధపడిపోకుండా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో, అందులో కూడా పాజిటివ్‌నెస్‌ని ఎలా వెతుక్కోవాలో సోనాలీ బింద్రేని చూసి నేర్చుకోవచ్చు అనిపిస్తోంది. కేన్సర్ వ్యాధి సోకినా భయపడకుండా ధైర్యంగా, ముఖం మీద నవ్వు చెదరకుండా పోరాడటానికి సిద్ధపడ్డారు సోనాలీ. ఆ మధ్య జుత్తుని సగానికి కత్తిరించుకున్న ఆమె తాజాగా గుండు చేయించుకున్నారు. తన ఆరోగ్యం గురించి చెప్పడంతో పాటు తన స్నేహితులందరికీ ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ లేఖ రాశారు. దాని సారాంశం ఈ విధంగా... ‘‘ఈ నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మాట చెబితే మీరందరూ నా వంక అదోలా చూడొచ్చు. కానీ అది నిజం. ఎందుకు చెబుతున్నానో వినండి. ప్రస్తుతం నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా తీసుకుంటున్నాను. ఆనందం దొరికే ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. నిజమే.. కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది. నిరాశ, నిస్పృహ నన్ను ముంచేస్తాయి. కానీ, నాకు నచ్చింది మాత్రమే నేను చేస్తున్నాను. నాకు నచ్చిన వాళ్లతోనే టైమ్ స్పెండ్ చేస్తున్నాను. దాంతో చాలా హ్యాపీగా ఉంటున్నాను. నా ఫ్రెండ్స్.. నా ధైర్యానికి వాళ్లే కారణం. వాళ్ల బిజీ షెడ్యూల్స్‌లో కూడా నా కోసం మెసేజ్, ఫోన్ కాల్, వీడియో కాల్ ఏదోటి చేసి నాతో టచ్‌లోనే ఉంటున్నారు. ఒక్క క్షణం కూడా నన్ను ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేయడం లేదు. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలియజేస్తున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరూ నా లైఫ్‌లో ఉండటం నా అదృష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఈ మధ్య రెడీ అవ్వడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టడంలేదు. ఊరికే జుత్తు దువ్వుకునే పని లేదు కదా (నవ్వుతున్న ఎమోజీ). అన్నింట్లో పాజిటివిటీ వెతుక్కుందాం’’ అంటూ ఈ నోట్‌ను, ఫొటోను షేర్ చేశారు. సోనాలీ పట్టుదల చూస్తే అభినందించకుండా ఉండలేం కదూ. -
సీనియర్ హీరోలకు మెగాస్టార్ విషెష్
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. సినీ పరిశ్రమలోని తన స్నేహితులు, సీనియర్ హీరోలు ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హాలకు శుభాకాంక్షలు చెప్పారు. ధర్మేంద్ర, సిన్హాలతో అమితాబ్ కలిసున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ 73 ఏళ్ల అమితాబ్ ట్వీట్ చేశారు. అమితాబ్, ధర్మేంద్ర (80) 1975లో బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో కలసి నటించారు. ఈ సినిమాల్లో వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించారు. ఈ సినిమా గురించి అమితాబ్ ప్రస్తావిస్తూ కొన్ని సంఘటనలు ఎప్పటికీ మధురంగా ఉంటాయి అంటూ, షోలేలోని ధర్మేంద్ర స్టిల్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే అమితాబ్, శత్రుఘ్న సిన్హాలు దోస్తానా సినిమాలో నటించారు.


