దోస్త్ మేరా దోస్త్

ఆదివారం స్నేహితుల దినోత్సవం. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య ఉన్న స్నేహాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘ఫ్రెండ్‌షిప్‌లో నెమ్మదిగా వెళ్లాలి. కానీ ఒక్కసారి ఫ్రెండ్ అయిన తర్వాత ఆ బాండ్ ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి. మా మధ్య ఫ్రెండ్‌షిప్‌ని వివరించడానికి ఈ కొటేషన్ చాలు’’ అన్నారు తారక్. ‘‘కొన్ని బంధాలు ఏర్పడటానికి సమయం తీసుకుంటాయి. ఏర్పడ్డాక తిరిగి చూసేపనిలేదు. తారక్‌తో నాకు అలాంటి బాండ్ ఏర్పడింది’’ అన్నారు చరణ్. వీళ్లిద్దరూ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనే పీరియాడికల్ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి