16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా బ్యాన్‌ | Karnataka Govt Bans Social Media Use For Children Under 16 Age Group, More Details Inside | Sakshi
Sakshi News home page

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా బ్యాన్‌

Mar 6 2026 12:11 PM | Updated on Mar 6 2026 1:38 PM

Karnataka Govt Bans Social Media Use By Children Under 16

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్‌ మీడియా వాడకంపై నిషేధం విధించింది.  అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మొబైల్‌ వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. పిల్లలపై మొబైల్స్‌ దుష్ప్రభావం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

పిల్లలకు సోషల్‌  మీడియాను దూరం చేయడానికి  బ్యాన్‌ చేసినట్లు  సీఎం తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్‌ మీడియాపై నిషేధం ఉండగా.. ఫిన్లాండ్‌, యూకే కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.

కాగా, సోషల్‌ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ పొంచి ఉన్నాయి. ఆ ప్లాట్‌ఫారమ్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌ను చూడటం, వేధింపులకు గురికావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.

గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా నియంత్రిస్తున్నాయి. ఆస్ట్రేలియా పిల్లలకు సోషల్‌ మీడియాను దూరంగా ఉంచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఈ స్ఫూర్తితో.. యూరోపియన్‌ యూనియన్‌ అంశాన్ని పరిశీలిస్తోంది. మరి కొన్ని దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి.
పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ సీఎం సిద్ధరామయ్య ఆంక్షలు 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement