మిస్టరీ వీడిన కారు బ్లాస్ట్‌ కేసు | - | Sakshi
Sakshi News home page

మిస్టరీ వీడిన కారు బ్లాస్ట్‌ కేసు

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

దొడ్డబళ్లాపురం: బాగలకోట జిల్లా జమఖండి తాలూకా హిప్పరగి గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న కారు బ్లాస్ట్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈమేరకు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆర్థిక, భూవివాదాల నేపథ్యంలో బార్‌ యజమాని హనుమంతను హత్య చేయడానికి నిందితులు ఈ కుట్ర చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. విజయపుర జిల్లా బబలేశ్వర తాలూకాకు చెందిన శివానంద పరసప్ప(29),రేవణప్ప(24), మహాదేవ(21),మల్లికార్జున(23) అరైస్టెన వారు. వీరికి పేలుడు పదార్థాలు ఏర్పాటు చేసిన గజానన సంగాపుర అనే నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఏం జరిగిందంటే...

నిందితుడు శివానంద తన దగ్గరి బంధువు హనుమంత వద్ద అప్పు తీసుకున్నాడు. ఇందుకుగాను 4 ఎకరాలు తాకట్టు పెట్టాడు. అప్పు తీర్చాలని హనుమంత ఒత్తిడి చేస్తుండడంతో హనుమంత హత్యకు శివానంద కుట్ర పన్నాడు. గతనెల 25న రాత్రి హనుమంత బార్‌ మూసి ఇంటికి కారులో తిరిగి వెళ్తాడని తెలుసుకున్న శివానంద మరో ముగ్గురితో కలిసి కారులో పేలుడు పదార్థాలు పెట్టారు. అయితే హనుమంత కారు ఎక్కేలోపే పేలడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన జరిగాక నిందితులు సెకండ్‌ హ్యాండ్‌ మొబైల్‌లో నకిలీ సిమ్‌ కార్డు వేసి ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ ద్వారా హనుమంత అతడి తమ్ముడు బసవరాజుకు బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టారు. ఇచ్చిన అప్పు, భూమి రెండూ మర్చిపోవాలని లేదంటే ప్రాణాలు దక్కవని హెచ్చరించారు. పోలీసులకు ఈ విషయం చెప్పడంతో వారు ఆ కోణంలో దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

బీపీఎల్‌ కార్డుల పరిష్కరణ ప్రక్రియ నిలిపివేత

బనశంకరి: బీపీఎల్‌ రేషన్‌కార్డులు రద్దుభయంలో ఉన్న లక్షలాదికుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. రేషన్‌కార్డులు తనిఖీ, పరిష్కరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని ఆహారపౌరసరఫరాలశాఖమంత్రి రిజ్వాన్‌అర్హద్‌ ఆదేశాలుఇచ్చారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 2.65 కోటి రేషన్‌కార్డులు ఇ–కేవైసీ పరిశీలన పెండింగ్‌ ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా ముగిసిన అనంతరం అనర్హులు కార్డుల నిఖరసంఖ్య తెలుస్తుందన్నారు. అనంతరం అనర్హకార్డులు సంఖ్యకు అనుగుణంగా కొత్తగా కార్డులుకోసం వేచిచూస్తున్న అర్హులకు రేషన్‌కార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

అప్పు తీర్చాలనందుకు

వ్యక్తి హత్యకు కుట్ర

నలుగరి అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement