ఆంధ్రా కోటా నీరు అడగరా? | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రా కోటా నీరు అడగరా?

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

సాక్షి, బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలో బళ్లారి, కర్నూలు జిల్లాలకు తుంగభద్ర డ్యాం నుంచి తాగు, సాగునీరు సరఫరా చేసే ఎల్‌ఎల్‌సీ నుంచి ఏపీ కోటా నీరు అడిగే వరకు నీరు వదలమని రైతులు స్పష్టం చేశారు. శుక్రవారం తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ ఆధ్వర్యంలో పలువురు రైతులు సింధవాళ గ్రామం సమీపంలో 155 కిలోమీటరు వద్ద కాలువలోకి ఇసుక సంచులు వేసి నీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకట్టు వేశారు. కర్ణాటక కోటా కింద నీరు మాత్రమే విడుదల చేశారన్నారు. ఏపీకి కోటా ప్రకారం నీరు విడుదల చేసిన తర్వాత అడ్డుకట్ట తొలగిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నీటి విడుదలకు ఇండెంట్‌ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement